Home గాసిప్స్ అక్షరాలా 18 కోట్ల బిజినెస్ రేటు…అయినా ఉప్పెన టీం తుచ్చం అన్నారు…రీజన్ ఇదే!

అక్షరాలా 18 కోట్ల బిజినెస్ రేటు…అయినా ఉప్పెన టీం తుచ్చం అన్నారు…రీజన్ ఇదే!

0

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అవుతున్న కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, ఫిబ్రవరి 12 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు అయితే సాలిడ్ గా ఉండగా సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో క్రేజ్ మరింత పెరిగింది అని చెప్పాలి. ఇక సినిమా లాస్ట్ ఇయర్ డిజిటల్ రిలీజ్ కోసం….

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా వద్దూ అన్నారు, దానికి కారణం సినిమా బడ్జెట్ అంచనాలను మించి పెరిగి పోవడమే, ఇక సినిమా ఇప్పుడు ఓవరాల్ గా బిజినెస్ 40 కోట్ల రేంజ్ లో చేయాల్సి ఉండగా సినిమా థియేట్రికల్ బిజినెస్ కోసం టాలీవుడ్ లో లీడింగ్ ప్రొడ్యూసర్ ఒకరు…

ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ కి ఔట్ రైట్ రేటు గా 18 కోట్ల భారీ రేటు ఆఫర్ చేసినట్లు సమాచారం. కేవలం 2 తెలుగు రాష్ట్రాలలోనే 18 కోట్ల రేటు అంటే షాకింగ్ అనే చెప్పాలి. అయినా కానీ ఈ ఆఫర్ ను యూనిట్ నిర్మొహమాటంగా వద్దూ అని చెప్పేశారని అంటున్నారు.

దానికి కారణం కూడా ఉందట. ఔట్ రైట్ రేటు కి అమ్మితే.. సినిమా ద్వారా వచ్చే ప్రాఫిట్ లు అన్నీ ఇక ఆ రేటు పెట్టి కొన్న వాళ్ళకే వెళతాయి… అదే నిర్మాతలే అన్ని ఏరియాల్లో అమ్మి డిస్ట్రిబ్యూషన్ చేస్తే సినిమా అంచనాలను మించి కలెక్ట్ చేస్తే అందులో నుండి లాభాలను పంచుకోవచ్చు. దీంతో బిజినెస్ కొంచం తగ్గినా ఓవరాల్ గా ప్రాఫిట్స్ వస్తే పెట్టుబడి మొత్తం రికవరీ అవుతుంది అని ప్లాన్ అంటున్నారు.

సినిమా మీద మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న టీం ఇప్పుడు సినిమా ను మరింత బాగా ప్రమోట్ చేస్తూ ఉండగా ఫిబ్రవరి 12 న ముందు పోటి అనుకున్నా ఇప్పుడు సోలోగానే బరిలోకి దిగుతున్న ఈ సినిమా టాక్ పాజిటివ్ గా వస్తే కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఏం జరుగుతుందో ఫిబ్రవరి 12 న తేలనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here