మెగా ఫ్యామిలీ నుండి లాంచ్ కి సిద్ధంగా ఉన్న కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన సాంగ్స్ ద్వారా ఇప్పటికే మంచి క్రేజ్ ని సొంతం చేసుకోగా… సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ వలన నిరవధికంగా పోస్ట్ పోన్ అవ్వగా మిగిలిన సినిమాలకి వచ్చినట్లే ఈ సినిమా కి కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
నిర్మాతలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడానికి ఇష్టపడలేదు… దాంతో సినిమా కి మార్కెట్ రేటు కూడా ఇప్పుడు చాలా తగ్గింది. ఇలాంటి టైం లో ఇప్పుడు సినిమా పై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.
అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ, సినిమా షూటింగ్ టోటల్ గా కంప్లీట్ అవ్వగా సినిమా రషెస్ మొత్తం చూసుకున్న టీం ఓవరాల్ లెంత్ మరీ ఎక్కువగా ఉన్న ఫీలింగ్ కలిగిందట… దాంతో ఆ లెంత్ అలాగే ఉంచాలా లేక కట్ చేసి రెగ్యులర్ మూవీ లా చేయాలా అన్న డౌట్ లో ఉన్న టైం లో…
కొత్త ఆలోచన వచ్చిందట….. సినిమాను రెండు పార్టులుగా డైరెక్ట్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని…. సినిమా ఔట్ పుట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న టీం మొదటి పార్ట్ ని ఒక రేటు కి రెండో పార్ట్ ని మరో రేటు కి అమ్మి కొంచం గ్యాప్ తో రెండు పార్టులను డిజిటల్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది…
అని ప్లానింగ్ లో ఉన్నారని టాక్ ఉంది. దీని పై ఇంకా నిజా నిజాలు తెలియాల్సి ఉండగా ఇలా చేస్తే మట్టుకు ఇదో కొత్త ప్రయోగంలా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు…ఫస్ట్ పార్ట్ కి రేటు అటూ ఇటూ అయినా సినిమా కి వ్యూస్ బాగా వస్తే సెకెండ్ పార్ట్ కూడా బిజినెస్ చేసుకోవచ్చు. మరి ఈ ప్రయోగం నిజం అవుతుందో లేక రూమర్ గానే మిగిలిపోతుందో త్వరలో తేలనుంది…