Home గాసిప్స్ ఏంటి…ఉప్పెన సేఫ్ అవ్వాలి అంటే ఇంత బిజినెస్ చేయాలా…షాకింగ్ అసలు!

ఏంటి…ఉప్పెన సేఫ్ అవ్వాలి అంటే ఇంత బిజినెస్ చేయాలా…షాకింగ్ అసలు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి క్రేజ్ నడుమ త్వరలో బరిలోకి దిగుతున్న సినిమా ఉప్పెన. లాస్ట్ ఇయరే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా వలన రిలీజ్ కి నోచుకోలేదు కానీ డిజిటల్ రిలీజ్ కి ఎన్ని ఆఫర్లు వచ్చినా కానీ నో చెబుతూ వచ్చిన టీం సినిమాను ఎట్టి పరిస్థితులలో థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యి అన్ని పనులను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర…

వచ్చే 12 న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉండగా ఈ సినిమా గురించిన బడ్జెట్ లెక్కలపై మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నెలకొంది. సినిమా డిజిటల్ రిలీజ్ గా రాకుండా ఉండటానికి ఇదే మెయిన్ కారణం అని అనుకుంటున్నారు. సినిమా బడ్జెట్ ట్రేడ్ లో అనుకుంటున్నట్లు….

25 కోట్ల రేంజ్ లో కూడా అవ్వలేదని, రీ షూట్ లు, అలాగే లేట్ వలన ఫైనాన్స్ కలిపి ఓవరాల్ గా సినిమా 38 కోట్ల రేంజ్ లో రూపొందింది అని అంటున్నారు. దాంతో సినిమా ఇప్పుడు రికవరీ అవ్వాలంటే ఓవరాల్ గా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ లు కలిపి మొత్తం మీద…

40 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంటేనే నిర్మాతలు సేఫ్ అవుతారు అని అంటున్నారు. ఈ రేంజ్ లో సినిమా బిజినెస్ డిజిటల్ రిలీజ్ లో జరగదు కాబట్టి సినిమాను ఎట్టి పరిస్థితులలో థియేటర్స్ లో రిలీజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి డిజిటల్ రిలీజ్ కి నో చెబుతూ వచ్చారని అంటున్నారు. థియేట్రికల్ బిజినెస్ 16 నుండి 20 కోట్ల రేంజ్ లో జరపాలని కోరుకుంటున్నారు నిర్మాతలు.

మరి సినిమా బిజినెస్ ఆ రేంజ్ లో జరిగితే సగం రికవరీ అయ్యే అవకాశం ఉంది, తర్వాత డిజిటల్, శాటిలైట్ మ్యూజిక్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ తో మరింత రికవరీ అవ్వొచ్చు అనేది ప్లాన్ మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో త్వరలోనే బిజినెస్ వివరాలు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here