బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచి అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఉప్పెన మూవీ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిన ఉప్పెన సినిమా టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తూ దూసుకు పోతూ ఉంది. ఇలాంటి సంచలన రికార్డులను నమోదు చేసిన ఉప్పెన మూవీ…
కథ పాయింట్ చాలా వరకు ఇది వరకు వచ్చిన సైరాత్ మూవీ నుండి తీసుకున్నారు అని చాలా మంది అనుకున్నారు, కానీ అది కొంచమే కరెక్ట్ అని, అసలు కథ పాయింట్ ని ఓ హాలీవుడ్ మూవీ నుండి స్పూర్తి పొంది రాసుకున్నారు అంటూ ఇప్పుడు టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.
వివరాల్లోకి వెళితే… సినిమా కథ పాయింట్ మొత్తం కూడా 2017 లో హాలీవుడ్ లో వచ్చిన ‘మడ్ బౌండ్’ అనే అమెరికన్ మూవీ నుండి తీసుకున్నారని తెలుస్తుంది. ఒక నవల ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా కథ పాయింట్ కూడా ఇలానే ఉంటుంది కానీ…
అక్కడ కథ ఎప్పటి నుండో చరిత్రలో ఉన్న తెల్ల జాతీయులు మరియు నల్ల జాతీయుల మధ్య గొడవ గా చూపెట్టారు…ఎనిమిది దశాబ్దాల క్రితం మిసిసిపి ప్రాంతంలో తెలుపు నలుపు జాతీయుల మధ అంతర్యుద్ధం నేపధ్యంగా తీసుకుని ఈ ప్రేమకథను రూపొందించారు. కాకపోతే ఇందులో బ్లాక్ హీరోకి వైట్ హీరోయిన్ కి కొడుకు పుడతాడు. ఆ విషయం తెలిసిన తర్వాత హీరోయిన్ ఫ్యామిలీ వాళ్ళు హీరో మ్యాన్ హుడ్ ని కోసేస్తారు….
అదే కథ పాయింట్ ని తీసుకుని పల్లెటూరి నేపధ్యంలో మార్చుకుని ఇప్పుడు ఉప్పెన సినిమా వచ్చింది అంటున్నారు. ఇక్కడ పిల్లల టాపిక్ లేకుండా….కథ మెయిన్ ట్విస్ట్ సేం అయినా ఇక్కడ ట్రీట్ మెంట్ కంప్లీట్ గా ఆకట్టుకునే విధంగా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండగా ఉప్పెన బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకుని సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది…