మోస్ట్ అవైటెడ్ మూవీ ఉప్పెన బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధం అయ్యింది, ఇక సినిమా కి ఇప్పటికే ఆడియన్స్ లో సెన్సేషనల్ క్రేజ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ రిలీజ్ కి ముందు ఉన్న పరిస్థితులలో సినిమాకి ఇప్పుడున్న క్రేజ్ లో సగం కూడా బజ్ లేదు, కానీ ఏడాది ఆగి సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ చేయాలి అన్న నిర్ణయం ఇప్పుడు ఓ రేంజ్ లో ఇంపాక్ట్ చూపేలా ఉంది.
సాంగ్స్ కి, టీసర్ ట్రైలర్ లకి అల్టిమేట్ రెస్పాన్స్ రాగా యూత్ లో సినిమా పై ఆసక్తి ఓ రేంజ్ లో పెరిగి పోయింది, దానికి తోడూ క్లైమాక్స్ ట్విస్ట్ లీక్ అవ్వడం కూడా సినిమా పై మరింత ఆసక్తి ని క్రియేట్ చేసేలా చేసింది. ఇప్పుడు ఇవన్నీ అడ్వాంటేజ్ గా మారాయి సినిమాకి.
ఇప్పుడు సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ హైక్స్ కూడా ఉండగా ఓపెనింగ్స్ సాలిడ్ గా రావడానికి ఇవి మరింతగా హెల్ప్ కాబోతున్నాయి. ఇక వీటికి మించి మరో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ సినిమాకి దగ్గబోతుంది, అది రెండు తెలుగు రాష్ట్రాలలో కంప్లీట్ గా 100% ఆక్యుపెన్సీ దక్కడం అని చెప్పాలి.
తెలంగాణ లో 100% ఆక్యుపెన్సీ తో థియేటర్స్ ని నడుపుకోవచ్చు అని ప్రభుత్వం ఈ మధ్యే చెప్పగా అప్పటి నుండి 100% ఆక్యుపెన్సీ తో థియేటర్స్ నడుస్తున్నా కానీ ఆంధ్రాలో కొన్ని చోట్ల మినహా అన్ని చోట్ల మాత్రం 100% ఆక్యుపెన్సీ లేదు. కానీ రీసెంట్ గా ప్రభుత్వం అక్కడ కూడా 100% ఆక్యుపెన్సీ తో థియేటర్స్ ని నడుపుకోవచ్చు అంటూ రీసెంట్ గా ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఇప్పుడు కంప్లీట్ గా…
100% ఆక్యుపెన్సీ అన్ని చోట్లా ఉండబోతుండగా టికెట్ హైక్స్, భారీ రిలీజ్ తో పాటు 100% ఆక్యుపెన్సీ తో ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలను సృష్టించడానికి సిద్ధం అవుతుంది, ఈ అడ్వాంటేజ్ లు చూస్తుంటే సినిమా ఓపెనింగ్స్ తోనే అల్టిమేట్ రికార్డులను బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.