బాక్స్ ఆఫీస్ దగ్గర వినాయక చవితి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో చిన్న సినిమా అయిన ఉరుకు పటేల(Uruku Patela Movie Review) కూడా ఒకటి….ట్రైలర్ పర్వాలేదు అనిపించేలా ఉండటంతో సినిమా కూడా ఆడియన్స్ ను అలరిస్తుంది అనిపించగా మరి సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే చదువుకోని హీరో ఊర్లో ఉంటూ చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు కానీ తనకి పెళ్లి సెట్ అవ్వదు…అలాంటి టైంలో ఒక డాక్టర్ అయిన హీరోయిన్ మాత్రం హీరో ని ఇష్టపడి మరీ పెళ్లికి సిద్ధం అవుతుంది…ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథ…
మొత్తం మీద కథ పాయింట్ పరంగా ఆసక్తి కలిగించేలానే ఉన్నా కూడా డైరెక్టర్ తెరకెక్కించిన విధానం నిరాశ పరిచింది…హీరో రోల్ పర్వాలేదు అనిపించేలా మెప్పించగా హీరోయిన్ కూడా ఓకే అనిపించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించినా కథ పరంగా డైరెక్టర్ అనుకున్న రేంజ్ లో…
తెరకెక్కించకపోవడంతో కొన్ని సీన్స్ మినహా మిగిలిన కథ మొత్తం నిరాశ పరిచే విధంగా తెరకెక్కింది…ఫస్టాఫ్ లో హీరో హీరోయిన్స్ లవ్ సీన్స్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు…తర్వాత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను ప్లాన్ చేసినా కూడా చాలా వరకు కథ ఫ్లాట్ గా మారిపోయింది…
దాంతో ఆడియన్స్ కి థ్రిల్లింగ్ మూమెంట్స్ చూపించాల్సిన చోట కథ పూర్తిగా ఫ్లాట్ గా మారిపోవడంతో అక్కడక్కడా కొన్ని సీన్స్ మినహా ఏ దశలో కూడా మెప్పించలేక పోయిన సినిమా ఓవరాల్ గా ఎండ్ అయ్యే టైంకి నిరాశ పరిచే విధంగానే ఎండ్ అయ్యింది…
సినిమా లో మెయిన్ పాయింట్ కి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కనుక ఉండి ఉంటే ఓవరాల్ గా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉండేది సినిమా…కానీ డైరెక్టర్ పాయింట్ బాగానే తీసుకున్నా చెప్పిన విధానం నిరాశ పరిచడంతో ఏమాత్రం మెప్పించలేక పోయింది సినిమా…
Stree2 collections please