Home న్యూస్ వకీల్ సాబ్ రికార్డ్ ఔట్, టైర్ 2 హీరోల్లో 2nd ప్లేస్…ఏం భీభత్సం సామి ఇది!!

వకీల్ సాబ్ రికార్డ్ ఔట్, టైర్ 2 హీరోల్లో 2nd ప్లేస్…ఏం భీభత్సం సామి ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలన కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుంది. సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా 1000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అమెరికాలో ప్రీమియర్ షోల కలెక్షన్స్ తో ఇప్పుడు…

టాలీవుడ్ తరుపునే కాదు ఇండియా తరుపున కూడా బిగ్గెస్ట్ రికార్డ్ ను అందుకుంది. అక్కడ ప్రీమియర్ షోలు అప్ డేట్ అయిన ఫైనల్ కలెక్షన్స్ తో $313K మార్క్ ని అందుకున్న ఈ సినిమా ఊచకోత అంటే ఇదే అనిపించే లెవల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

ఈ క్రమం లో అక్కడ ఈ ఇయర్ సమ్మర్ లో 30-40% ఆక్యుపెన్సీ తోనే ఊరమాస్ కలెక్షన్స్ తో రికార్డులను క్రియేట్ చేసిన పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమా $301K మార్క్ ని ఇప్పుడు కేసులు లక్షల్లో ఉన్నా ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉన్న లవ్ స్టొరీ అడ్వాంటేజ్ అండ్ క్రేజ్ తో బ్రేక్ చేసింది.

ఇక టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో అక్కడ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న వాళ్ళలో… 2018 లో వచ్చిన గీత గోవిందం సినిమా $403K డాలర్స్ ను అందుకుంటే ఇప్పుడు రెండో ప్లేస్ లో లవ్ స్టొరీ సినిమా నిలిచింది, ఇక మూడో ప్లేస్ డియర్ కామ్రేడ్ సినిమా $310K మార్క్ ని అందుకోగా 4 వ ప్లేస్ లో MCA సినిమా $304K మార్క్ ని…

అందుకుని సంచలనం సృష్టించింది. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టైర్ 2 హీరోల్లో టాప్ 2 ప్లేస్ ని 2021 ఇయర్ లో ఇండియా తరుపున టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుని భీభత్సం సృష్టించింది. ఇక వీకెండ్ లో అక్కడ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here