మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ “వాల్మీకి (గద్దల కొండ గణేష్)”… హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తమిళ్ బ్లాక్ బస్టర్ జిగత్తాండ కి రీమేక్, అయినా తెలుగు ఆడియన్స్ కి నచ్చే మార్పులతో హరీష్ శంకర్ సినిమా ను బాగా రూపొందించాడు, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ సినిమా ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు, రిలీజ్ అయిన మార్నింగ్ షో కే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా..
బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా కూడా ఇప్పుడు దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ స్లో గా స్టార్ అయినా మార్నింగ్ షో నుండి టికెట్ సేల్స్ జోరు ఓ రేంజ్ లో పెరిగింది, మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా…
40% వరకు ఆక్యుపెన్సీ ఉండగా అది ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి 60% కి పైగా పెరిగింది, మాస్ సెంటర్స్ లో ఆక్యుపెన్సీ మరింత ఎక్కువ ఉండటం విశేషం, దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ వసూళ్లు అందుకునేలా ఉందని చెప్పాలి.
తొలిరోజు ఇప్పుడు అవలీలగా 4 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ కన్ఫాం అవ్వగా ఫైనల్ లెక్కలు కూడా అనుకున్న విధంగా ఉంటె కచ్చితంగా 4.4 కోట్ల దాకా సినిమా తొలిరోజు షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ప్రీమియర్ షోల తో 75 వేల డాలర్స్ ని అందుకున్న సినిమా… మొదటి రోజు వరల్డ్ వైడ్ గా…
5.5 కోట్ల నుండి 6 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని సమాచారం, ఇది నిజంగానే సాలిడ్ మాస్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. ఇక తొలి రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అన్నది ఆసక్తి కరంగా మారింది. అఫీషియల్ కలెక్షన్స్ రిలీజ్ అయిన వెంటనే అప్ డేట్ చేస్తాం.