వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అందరి అంచనాలను తలకిందలు చేసి అల్టిమేట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల లోపు షేర్ ని అందుకుంటుంది అనుకున్నా అంతకి మించి వసూళ్ళ ని సాధించి ఏకంగా 5.8 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ఇందులో 85 లక్షల దాకా హైర్స్ కలెక్షన్స్ కూడా యాడ్ అయ్యాయి.
మొత్తం మీద మాస్ సెంటర్స్ లో అల్టిమేట్ ట్రెండ్ ని కొనసాగించిన ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో ది బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, సోలో హీరోగా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా వాల్మీకి (గద్దల కొండ గణేష్) నిలవడం విశేషం అని చెప్పొచ్చు.
సినిమా మొత్తం మీద మొదటి రోజు ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.86Cr(20L hires)
?Ceeded:82.4L
?UA: 70L
?East: 54L
?West: 58L(20L Hires)
?Guntur: 71L(40L Hires)
?Krishna: 41.4L
?Nellore: 20L(5L Hires)
AP-TG Day 1:- 5.83Cr
Ka & ROI: 42L
OS: 56L
Total: 6.81Cr
ఇదీ మొత్తం మీద వాల్మీకి (గద్దల కొండ గణేష్) మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ భీభత్సం….హైర్స్ ని పక్కకు పెట్టినా రెండు తెలుగు రాష్ట్రాలలో వర్త్ షేర్ 5 కోట్ల రేంజ్ లో ఉండటం నిజంగానే విశేషం అని చెప్పాలి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ మొదటి రోజు గ్రాస్ 11.6 కోట్ల దాకా ఉందట.
ఇక సినిమా ను మొత్తం మీద 24.25 కోట్లకు అమ్మగా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 18.19 కోట్ల షేర్ ని సాధిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇక రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.