టాలీవుడ్ కల్ట్ మూవీస్ లో ఒకటైన అర్జున్ రెడ్డి సినిమాను వేరే ఇండస్ట్రీలలో రీమేక్ చేశారు కానీ, ఒకే ఇండస్ట్రీ నుండి 2 సార్లు రీమేక్ చేయడం ఒక్క కోలివుడ్ లోనే జరిగింది, మొదటి సారి రీమేక్ వర్షన్ ని చాలా మార్పులతో డైరెక్టర్ బాలా మార్చగా ఆ వర్షన్ చూసిన హీరో ధృవ్ విక్రం ఫాదర్ విక్రం ఆ వర్షన్ ఏమాత్రం బాలేదని చెప్పి మళ్ళీ ఫ్రెష్ గా సినిమాను రీమేక్ చేసి రిలీజ్ చేశారు.
ఫలితం తేడా కొట్టినా కానీ బాలా వర్షన్ వర్మా ఎందుకని ఆపేశారు అన్నది ఆసక్తిగా మారగా సినిమాను రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు. ఇండియా లో 4 యాప్స్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను పే పెర్ వ్యూ పద్దతిలో 140 టికెట్ రేటు తో రిలీజ్ చేయగా…
ఫస్ట్ డే 12 వేల వ్యూస్ ని, వీకెండ్ లో 28 వేల వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ పరుగును ఇప్పుడు కంప్లీట్ చేసుకోగా 140 టికెట్ రేటు మీద 55 వేల దాకా వ్యూస్ ని సొంతం చేసుకుందట. తర్వాత టికెట్ రేటు ని 50 కి తగ్గించగా అప్పుడు మరో 21 వేల దాకా…
వ్యూస్ ని ఈ సినిమా సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే సినిమా టికెట్ రేటు 140 తో…. 55 వేల దాకా వ్యూస్ కి మొత్తం మీద 77 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 50 టికెట్ రేటు తో 21 వేల వ్యూస్ కి 10 లక్షల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు.
ఓవరాల్ గా టోటల్ గా సినిమా డిజిటల్ రిలీజ్ పరుగు ముగిసే సరికి 87 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇందులో 20% OTT యాప్స్ కి మిగిలినవి నిర్మాతలకు వెళతాయి అంటున్నారు. సినిమా బడ్జెట్ ఎంతో చెప్పలేదు కానీ డిజిటల్ రిలీజ్ లో కూడా సినిమా భారీ నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుందని చెప్పొచ్చు.