సీనియర్ హీరోల్లో ఈ మధ్య ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీస్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తున్న హీరో విక్టరీ వెంకటేష్, సోలో హీరోగా తక్కువగా మల్టీ స్టారర్స్ లో ఈ మధ్య ఎక్కువగా నటించడం తో ఆడియన్స్ వెంకీ నుండి సోలో హీరోగా సినిమాలను ఎక్స్ పెర్ట్ చేస్తుండగా అంచనాలను తగ్గట్లే అసురన్ రీమేక్ నారప్ప ని అలాగే దృశ్యం 2 రీమేక్ ని చేస్తున్న వెంకీ ఈ సినిమాల్లో నారప్ప సినిమాను…
ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కూడా టాప్ స్టార్స్ రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకుంటూ ఉండగా తర్వాత ప్లేస్ లో బాలయ్య, వెంకటేష్ లేదా నాగార్జునలు ప్లేసులు మారుతూ ఉంటారు అప్పుడప్పుడు…
ఇక హోమ్ బ్యానర్ అయినప్పటికీ నారప్ప సినిమా కి వెంకటేష్ తీసుకున్న రెమ్యునరేషన్ సీనియర్ హీరోలలో సెకెండ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం నిర్మాతలు మొత్తం మీద 23 కోట్ల బడ్జెట్ ని కేటాయించగా అందులో నుండి వెంకటేష్ రెమ్యునరేషన్ ని పక్కకు పెడితే…
మొత్తం మీద సినిమా 14 కోట్ల రేంజ్ బడ్జెట్ లో పూర్తీ అయ్యిందని అంటున్నారు ట్రేడ్ లో… అంటే ఈ సినిమా కోసం వెంకటేష్ రెమ్యునరేషన్ కింద 9 కోట్ల మేర రెమ్యునరేషన్ ని తీసుకున్నారని అంటున్నారు ఇప్పుడు… ఓవరాల్ గా బడ్జెట్ తక్కువే అయిన ఈ రేంజ్ రెమ్యునరేషన్ వెంకటేష్ తీసుకుంటూ ఉండటం సినిమా ఓవరాల్ గా అల్టిమేట్ రికార్డ్ డిజిటల్ రైట్స్ ని కూడా సొంతం చేసుకోవడం…..
విశేషం అనే చెప్పాలి…. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే రీ సౌండ్ ఓ రేంజ్ లో వినిపించేది కానీ డిజిటల్ లో రిలీజ్ అవ్వడం తో ఓవరాల్ గా వ్యూస్ వరకే లెక్కలు అప్పుడప్పుడు ట్రేడ్ లో వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ సినిమా తో సోలో హీరోగా మరోసారి ఆడియన్స్ మనసును గెలుచుకుని ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నాడు వెంకటేష్.