ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు రావాల్సిన సినిమాలలో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసిన సినిమాల్లో ముందు నిలిచే సినిమా నారప్ప… విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ అసురన్ సినిమా తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా కోసం అందరూ ఆశగా ఎదురు చూసి వెంకటేష్ రీమేక్ చేస్తున్న కారణంగా ఒరిజినల్ ని చూడకుండా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
కానీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ ఈ ఇయర్ సెకెండ్ వేవ్ వలన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాకుండా ఆగిపోతూ ఉండగా ఈ ఇయర్ సెకెండ్ వేవ్ తర్వాత సినిమా థియేటర్స్ లోకి వస్తుంది అనుకున్నా సాలిడ్ డీల్ రావడం తో అమెజాన్ ప్రైమ్ కి సినిమాను….
అమ్మారని టాలీవుడ్ మొత్తం వార్తలు శిఖారు చేయగా మేకర్స్ వాటినేమి కండించలేదు, ఇక రిలీజ్ డేట్ కూడా కన్ఫాం అయినట్లేనని అఫీషియల్ అప్ డేట్ త్వరలో అనుకున్న టైం లో తెలుగు సినిమాలు డైరెక్ట్ రిలీజ్ లు అక్టోబర్ దాకా పెట్టుకోవద్దు అంటూ రూల్ పెట్టారు. దాంతో ఇక నారప్ప సినిమా డిజిటల్ రిలీజ్ ను…
కాన్సిల్ చేసుకుని ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో వస్తుంది అనుకుంటే… రీసెంట్ గా సినిమా నిర్మాత సురేష్ బాబు థియేటర్ ఓనర్స్ పై ఒత్తిడి ఎక్కువ ఉందని, కానీ నిర్మాతలు భారీ డబ్బులు పెట్టి సినిమాలు నిర్మిస్తారు కాబట్టి నిర్ణయాలు వాళ్ళకే ఒదిలేస్తే మంచిది అంటూ చెబుతూ ఫ్యూచర్ లో అంతా నార్మల్ అవ్వాలని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చారు.
దాని మీనింగ్ ఇన్ డైరెక్ట్ గా సినిమాలు డిజిటల్ లో రిలీజ్ చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చినట్లే నని అంతా అనుకుంటూ ఉండగా రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ త్వరలో నారప్ప రాబోతుంది అంటూ యాడ్స్ ని ఇవ్వడం మొదలు పెట్టింది… సినిమా ఈ నెల 20కి డిజిటల్ రిలీజ్ కాబోతుంది అంటున్నారు. మరి దీనిపై అక్టోబర్ వరకు డిజిటల్ రిలీజ్ వద్దు అంటూ రూల్ పెట్టిన వాళ్ళు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తి కరంగా మారింది ఇప్పుడు.