ఒకప్పుడు హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా సినిమా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ ఫ్లాఫ్ మూవీస్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) క్రేజ్ తర్వాత టైంలో కొంచం తగ్గినా తర్వాత టైంలో అంతకు మించిన క్రేజ్ ను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న…
కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో అని అనుకున్నా కూడా…
సినిమా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ రీసెంట్ గా 400 కోట్ల గ్రాస్ ను 200 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది…ఇక సినిమా మిక్సుడ్ టాక్ తో ఏకంగా రజినీకాంత్ నటించిన ఎపిక్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన…
జైలర్(Jailer Movie) కలెక్షన్స్ ని క్రాస్ చేసింది…లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 606 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా తమిళనాడులో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఏకంగా 188.10 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ తో సంచలనం సృష్టించగా…
ఇప్పుడు మిక్సుడ్ టాక్ తోనే విజయ్ గోట్ మూవీ 13వ రోజున ఈ కలెక్షన్స్ ని క్రాస్ చేసి 195 కోట్ల లోపు కలెక్షన్స్ ని అందుకుంది 200 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది. ఈ రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సాన్ని మిక్సుడ్ టాక్ తోనే సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు…ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి.