ఈ ఇయర్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన సినిమాలలో ఒకటైన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie REVIEW Rating) ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది… మరి సినిమా మీద పెరిగిన అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే….స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆఫీసర్ అయిన హీరో ఎన్నో సక్సెస్ ఫుల్ మిషన్స్ ను లీడ్ చేస్తాడు…కానీ థాయిలాండ్ లో ఒక మిషన్ లో తనకి వ్యక్తిగతంగా భారీ ఎదురుదెబ్బ తగలడంతో, ఆ జాబ్ మానేసి ఇమిగ్రేషన్ ఆఫీసర్ గా చెన్నైలో సెటిల్ అవుతాడు…కానీ అనుకోకుండా మళ్ళీ ఒక మిషన్ ను…
లీడ్ చేయాల్సి రావడంతో మాస్కో వెళతాడు….అక్కడ హీరోకి ఓ నిజం తెలుస్తుంది….ఆ నిజం తెలిసాక ఏం జరిగింది, మిగిలిన కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… మెయిన్ సస్పెన్స్ పాయింట్ ను ఇక్కడ రివీల్ చేయడం లేదు…. పెర్ఫార్మెన్స్ పరంగా ఇది పూర్తిగా విజయ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు…
డిఫెరెంట్ గెటప్స్ తో, పాత్రలతో విజయ్ నటించిన తీరు చాలా బాగా మెప్పించింది, యాక్షన్ సీన్స్ కానీ, రెండు సాంగ్స్ లో విజయ్ స్టెప్స్ కానీ అదుర్స్ అనిపించాయి…హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా బాగా మెప్పించాయి… మిగిలిన పాత్రల్లో ప్రభుదేవ, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి, యోగిబాబు అందరూ పర్వాలేదు అనిపించేలా నటించారు….
సంగీతం సినిమాకి మేజర్ మైనస్ పాయింట్….ఆడియో పెద్దగా ఇంప్రెస్ చేయలేదు…బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఓకే అనిపించేలానే ఉంది….ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే తమిళ్ ఆడియన్స్ వరకు ఎలా ఉన్నా మనవరకు మాత్రం ఈజీగా 20 నిమిషాలకి పైగానే ఎడిట్ చేయోచ్చు…అలా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది… ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి…
ఇక డైరెక్టర్ వెంకట్ ప్రభు హాలీవుడ్ లో వచ్చిన జెమినీ మాన్ సినిమా కాన్సెప్ట్ ను ఇక్కడ వాడుకున్నాడు అనిపించింది. డీ ఏజ్ విజయ్ రోల్ ముందు డైజస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది..తర్వాత పర్వాలేదు అనిపించగా…ఓవరాల్ గా సినిమా కథ చాలా సింపుల్ గా ఉండటం, చాలా వరకు సీన్స్ గెస్ చేసేలానే ఉండటం, అన్నింటికీ మించి లెంత్ మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ అండ్ డ్రాగ్ సీన్స్ వలన బోర్ ఎక్కువ అయినట్లు అనిపించింది…
ఇవి మైనస్ లు అయితే విజయ్ వన్ మ్యాన్ షో, ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్, ట్విస్ట్ లు టర్న్ లు బాగానే వర్కౌట్ అవ్వడం, ఫైట్ సీన్స్, 2 సాంగ్స్ లో విజయ్ స్టెప్స్…లాంటివి ప్లస్ పాయింట్స్…ఓవరాల్ గా సినిమా ఫ్యాన్స్ కి బాగా నచ్చే అవకాశం ఉండగా మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రం ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు… సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్….