బాక్స్ ఆఫీస్ దగ్గర చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ కోబ్రా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వినాయక చవితి కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా ఏకంగా 3 గంటలకు పైగా లెంత్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది… కానీ సినిమా వచ్చిన తర్వాత ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది సినిమా… టాక్ ఏమాత్రం పాజిటివ్ గా లేక పోవడంతో ఓపెనింగ్స్ పై ఆ ఇంపాక్ట్ గట్టిగానే ఉన్నప్పటికీ కూడా సినిమా…
వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ తో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 24 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా ఫ్లాఫ్ టాక్ ఇంపాక్ట్ తో రెండో రోజు ఆక్యుపెన్సీ ఒక్కసారిగా భారీగా పడిపోయింది.
సినిమా చూసిన వాళ్ళు అందరూ కూడా సినిమా లెంత్ విషయంలో మేజర్ కంప్లైంట్ చేస్తూ ఉండటంతో ఇప్పుడు ఈ విషయాన్నీ తెలుసుకున్న మేకర్స్ వెంటనే సినిమా లెంత్ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుని లెంత్ ని తగ్గించాలని డిసైడ్ అయ్యారు… ఏకంగా సినిమా లెంత్ ను ఇప్పడు…
20 నిమిషాల దాకా లెంత్ ని తగ్గించారు మేకర్స్… దాంతో ఉన్నంతలో ఇప్పుడు మరీ లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ ఆడియన్స్ కి ఉండకపోవచ్చు కానీ, కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే అండ్ బోర్ సీన్స్ ని ఎంతవరకు ఎడిట్ చేశారు, ఆడియన్స్ కి ఇప్పుడు ట్రిమ్ వర్షన్ ఎలా అనిపిస్తుందో అన్నది ఆసక్తికరం అని చెప్పాలి.