రిలీజ్ సమయంలో చాలా సినిమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ అవుతాయి. కొన్ని సినిమాలకు మాత్రం ఎదో ఒక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. లేటెస్ట్ గా ఇలాంటి ఇబ్బందులనే ఎదురుకుంటుంది యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ చక్ర. సినిమా లాస్ట్ ఇయర్ ట్రైలర్ లాంచ్ తర్వాత నుండి ఎప్పుడూ ఎదో ఒక వార్తల్లో వివాదాల్లో ఇరుక్కుంటూ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఈ సినిమా కి మంచి రేటు వస్తే…
డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలనీ చాల ట్రై చేశారు యూనిట్, ఆల్ మోస్ట్ డీల్ సెట్ అయ్యే టైం కి విశాల్ లాస్ట్ మూవీ లాస్ ఇబ్బందుల వలన ఈ సినిమా కి కోర్టులో నోటిసులు రావడం ఇబ్బంది కలిగించింది. తర్వాత రేటు పూర్తిగా తగ్గడం తో ఇక థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా…
రిలీజ్ డేట్ ని ఫిబ్రవరి 19 న అనౌన్స్ చేయగా రిలీజ్ రెండు రోజుల ముందు సడెన్ గా సినిమా పై మరో వివాదం స్టార్ట్ అయింది. ఈ సినిమా కథ నాదే అంటూ తమిళ నిర్మాత రవి ఈ సినిమా కథపై తనకు హక్కులు ఉన్నాయని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
రెండు వాదనలను పరిశీలించిన తర్వాత మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలకు స్టే విధించింది. అలాగే తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుతో విశాల్ కాస్త నిరాశకు గురైనట్లు సమాచారం. దాంతో ఇప్పుడు సినిమా సజావుగా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్ కూడా ఉంది కానీ మేకర్స్ మాత్రం 19 న సినిమా ఎలాగైనా రిలీజ్ అవుతుందని సన్నాహాలు మొదలు పెట్టారు.
అభిమన్యుడు తర్వాత మళ్ళీ అలాంటి హిట్ కొట్టే అవకాశం ఉంది అని టాక్ ఉన్న ఈ చక్ర సినిమా డిజిటల్ మోసాల పై తెరకెక్కిన కథ… అన్ని పనులను పూర్తీ చేసుకుని రిలీజ్ అవుతున్న టైం లో ఈ ఇబ్బందులను యూనిట్ ఎలా అధిగమించి సినిమాను రిలీజ్ చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది…