Home గాసిప్స్ గోపీచంద్-మారుతి మూవీ…ఆ 120 కోట్ల బాలీవుడ్ సూపర్ హిట్ కి రీమేకా?

గోపీచంద్-మారుతి మూవీ…ఆ 120 కోట్ల బాలీవుడ్ సూపర్ హిట్ కి రీమేకా?

1799
0

యాక్షన్ హీరో గోపీచంద్ రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ తన మూవీస్ అన్నీ కూడా సాలిడ్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలే అవ్వడం విశేషం, తన అప్ కమింగ్ మూవీ టాలెంటెడ్ అండ్ రీసెంట్ గా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మారుతి డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే, మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని మొదలు పెట్టె ముందే…

అక్టోబర్ 1 న గ్రాండ్ రిలీజ్ కాబోతుందని ఆల్ రెడీ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా సాలిడ్ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. దీనికితోడూ ఈ సినిమా పై మరో ఆసక్తి కరమైన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ప్రకారం ఈ సినిమా…

ఒరిజినల్ కథతో కాకుండా రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా అని అంటున్నారు. 4 ఏళ్ల క్రితం బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా రీమేక్ గా ఈ సినిమా తెరకేక్కుతుందని అంటున్నారు. ఆ సినిమానే అక్షయ్ కుమార్ నటించిన జాలీ LLB2 సినిమా…

మొదటి పార్ట్ అర్షద్ వార్సీ నటించగా ఆ సినిమాను సప్తగిరి ఇక్కడ సప్తగిరి LLB గా రీమేక్ చేయగా సినిమా ఫ్లాఫ్ అయింది. కానీ జాలీ LLB2 మాత్రం అక్కడ మంచి హిట్ గా నిలిచి 120 కోట్లు కలెక్ట్ చేసింది. అలాంటి హిట్ మూవీ మెయిన్ కథ పాయింట్ ని తీసుకుని మారుతి తనదైన ట్రీట్ మెంట్ అందించి తెలుగు లో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అని తీస్తున్నారు అని అంటున్నారు.

ఆ సినిమాలో కూడా అక్షయ్ కుమార్ డబ్బుల కోసం ఏ కేసు పడితే ఆ కేసు వాదిస్తాడు, తర్వాత ఒక సీరియస్ కేసు తో తను మారిపోతాడు. ఇక్కడ పెట్టిన టైటిల్ పక్కా కమర్షియల్ కూడా ఆ కథ పాయింట్ ని గుర్తు చేసేలానే ఉంది… కానీ మారుతి ట్రీట్ మెంట్ కామెడీ ఉంటుంది కాబట్టి ఈ సినిమా తో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here