బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక భాషలో ఫెయిల్ అయితే వేరే భాషలో ఆ సినిమా వర్కౌట్ అవుతుంది అన్న నమ్మకం చాలా వరకు తగ్గిపోతుంది, దాంతో చాలా వరకు సినిమాలు ఫెయిల్ అయితే ఇతర భాషల్లో రిలీజ్ లు కూడా ఆగిపోతాయి కానీ ఇప్పుడు విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ లాఠీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 3.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 1.6 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఇంకా 2.90 కోట్ల షేర్ ని…
అందుకోవాల్సి ఉండగా సినిమా తెలుగు లో డిసాస్టర్ గా నిలవగా తమిళ్ లో కూడా తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాను ఇప్పుడు హిందీ లో డబ్ చేసి 30న రిలీజ్ చేశారు ఇప్పుడు…
ఇక్కడ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కానీ అక్కడ ఏకంగా 250 వరకు థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేస్తూ ఉండటంతో ఇక్కడే రిజల్ట్ ఇలా ఉంటే అక్కడ సినిమా మినిమమ్ కలెక్షన్స్ ని కూడా అందుకునే అవకాశం లేదు కానీ ఉన్నంతలో భారీగానే రిలీజ్ అవుతున్న సినిమా కి ఎలాంటి రిజల్ట్ అక్కడ సొంతం అవుతుందో చూడాలి.