Home న్యూస్ విశ్వాసం తెలుగు రివ్యూ…ప్లస్&మైనస్ పాయింట్స్

విశ్వాసం తెలుగు రివ్యూ…ప్లస్&మైనస్ పాయింట్స్

0

     తమిళనాడు లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అజిత్ కుమార్ “విశ్వాసం” సినిమా తెలుగు లో డబ్ అయ్యి ఈ రోజు రిలీజ్ అయ్యింది, అక్కడ హిట్ అయినంత మాత్రానా ఇక్కడ కూడా హిట్ అవ్వాలని రూల్ లేదు కదా… మరి సినిమా కామన్ తెలుగు ఆడియన్స్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం పదండీ. ముందుగా కథ విషయానికి వస్తే తన దూకుడు స్వభావం తో కొట్లాటలకి దిగే హీరో కొన్ని కారణాల వల్ల పాప పుట్టాక తన భార్య కి దూరం అవుతాడు.

తిరిగి 10 ఏళ్ల తర్వాత తన పాప మరియు భార్య తో కలిసి ఉందామని ట్రై చేస్తుంటే విలన్స్ పాప ని చంపాలని చూస్తారు, మరి హీరో ఎలా తన పాప ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేసి కాపాడాడు అన్నది మొత్తంగా సినిమా కథ పాయింట్. మన తెలుగు సినిమా తులసి ని పోలి కొంచం కథ ఉంటుంది.

ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే
* అజిత్ – నయనతార ల పెర్ఫార్మెన్స్
* ఫైట్ సీన్స్ అండ్ అజిత్ హీరోయిజం సీన్స్( గూస్ బంప్స్ ) గ్యారెంటీ
* బ్యాగ్రౌండ్ స్కోర్
* ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సీన్స్
మొత్తం మీద సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఇవి.

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే
* రొటీన్ కథ
* తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ అవ్వడం
* స్టొరీ లో తర్వాత సీన్ యిట్టె చెప్పే విధంగా ఉండటం
* అక్కడక్కడా స్లో గా ఉన్న ఫీలింగ్ కలగడం
ఓవరాల్ గా సినిమాలో ఇవి మేజర్ మైనస్ లుగా నిలుస్తాయి అని చెప్పొచ్చు.

ఉన్నంతలో సినిమాలో మాస్ కంటెంట్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంటుంది, అజిత్ ఫ్యాన్ అయితే సినిమా అద్బుతంగా అనిపిస్తుంది, రెగ్యులర్ కామన్ ఆడియన్స్ ఒకసారి చూసే విధంగా ఉంటుంది విశ్వాసం… ఫైనల్ గా మా రేటింగ్ 2.75 స్టార్స్… మీరు సినిమా చూస్తె ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here