నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమాలు రెండూ కూడా బాక్స్ అఫీ దగ్గర సూపర్ సక్సెస్ ఫుల్ మూవీస్ గా నిలిచి దుమ్ము దుమారం లేపాయి. వీర సింహా రెడ్డి కొంచం టాక్ అఖండ కన్నా తక్కువే వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అఖండ కన్నా ఎక్కువ కలెక్షన్స్ నే సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…
ఇక ఈ సినిమా కి గాను బాలకృష్ణ ఏ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు అన్నది ఆసక్తిగా మారగా సినిమా కన్నా ముందు వచ్చిన అఖండ కోసం ఆల్ మోస్ట్ 12 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాకి మరో 2 కోట్లు…
రెమ్యునరేషన్ ని పెంచేసి మొత్తం మీద 14 కోట్ల రేంజ్ లోనే రెమ్యునరేషన్ ని తీసుకున్నట్లు సమాచారం. ఓవరాల్ గా 75 కోట్ల రేంజ్ లో మార్కెట్ ను బాక్ టు బాక్ హిట్స్ తో సొంతం చేసుకున్న బాలయ్యకి ఇది కొంచం తక్కువ రెమ్యునరేషన్ అనే చెప్పాలి..
కానీ అదే టైంలో ఇప్పుడు తను చేయబోయే అప్ కమింగ్ మూవీకి మాత్రం మరో 2 కోట్లు పెంచేసి ఓవరాల్ గా 16 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని బాలయ్య తీసుకోబోతున్నారని సమాచారం. బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఇప్పుడు కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న బాలయ్య అప్ కమింగ్ మూవీస్ ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.