Home న్యూస్ 500 కోట్ల మార్క్…..చరిత్రకెక్కిన షారుఖ్ పఠాన్!!

500 కోట్ల మార్క్…..చరిత్రకెక్కిన షారుఖ్ పఠాన్!!

1

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ మూవీ రిమార్కబుల్ కలెక్షన్స్ రికార్డులను తిరగరాస్తూ బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సాధించని రేంజ్ లో రికార్డ్ వసూళ్ళని రిలీజ్ అయిన రోజు నుండి సొంతం చేసుకుంటూ షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే కాదు ఏకంగా హిందీ సినిమా ఇండస్ట్రీ రికార్డులను అన్నీ బ్రేక్ చేసిన ఈ సినిమా తక్కువ టైంలోనే ఏకంగా….

బాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక తర్వాత కూడా స్లో అవ్వకుండా దూసుకు పోతున్న ఈ సినిమా ఇప్పుడు 3 వారాలను అల్టిమేట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత 22వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు బాలీవుడ్ మూవీస్ లో సినిమా సాధించని విధంగా…

500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని ఇండియాలో సొంతం చేసుకోబోతుంది. సినిమా సౌత్ డబ్బింగ్ వర్షన్స్ తో కలిపి ఈ మార్క్ ని ఈ రోజు సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోసింది. ఇక ఈ వీకెండ్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న నేపధ్యంలో…

వాటికి కనుక సినిమా తట్టుకుని నిలబడితే కచ్చితంగా హిందీ వర్షన్ కూడా 500 కోట్ల నెట్ మార్క్ ని అందుకుని ఆల్ టైం ఎపిక్ బెంచ్ మార్క్ ని సెట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా ఈ వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ ఏ లెవల్ లో ఉంటాయో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here