నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే…. సంక్రాంతి సెలవులలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా తర్వాత స్లో అవ్వగా పోటిలో ఉన్న వాల్తేరు వీరయ్య వీర విహారంని తట్టుకుని లిమిటెడ్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగించింది. సినిమా మొత్తం మీద…
బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన అఖండ సినిమా కలెక్షన్స్ ని దాటేసి నంబర్ 1 కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా అన్ని ఏరియాల్లో దుమ్ము లేపింది. కానీ అదే టైంలో ఒక్క ఏరియాలో మాత్రం సినిమా అఖండ సినిమాను దాటలేక పోయింది..
ఆ ఏరియానే నైజాం… అఖండ సినిమా అన్ని చోట్లా కుమ్మేయగా నైజాంలో కూడా ఏకంగా 21.17 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది. అదే టైంలో పండగ టైంకి 15 కోట్లు దాటిన వీర సింహా రెడ్డి తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయి ఇప్పటి వరకు ఇక్కడ కేవలం 17.23 కోట్ల …
షేర్ ని మాత్రమే అందుకుని మిగిలిన ఏరియాలతో పోల్చితే ఈ ఒక్క ఏరియాలోనే అఖండతో పోల్చితే వెనకబడి ఉంది. దాంతో వీర సింహా రెడ్డి ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో నంబర్ 1 గా నిలిచినా నైజాంలో మాత్రం అఖండ సినిమానే నంబర్ 1 అని చెప్పాలి…