బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ 7 నెలలు గడచిపోయాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో కొన్ని క్రేజీ మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని పాన్ ఇండియా మూవీస్ ఉండగా మిగిలినవి రీజనల్ మూవీస్… అంటే ఒకే భాషలో రిలీజ్ అయిన సినిమాలు అన్నమాట…
ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో తెలుగు రాష్ట్రాలలో అలాగే ఇండియన్ మూవీస్ పరంగా రీజనల్ లాంగ్వేజ్ తోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన…
వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) రికార్డ్ ఓపెనింగ్స్ కలెక్షన్స్ అలాగే కొనసాగుతూ ఉండటం విశేషం…తెలుగు రాష్ట్రాలలో రీజనల్ మూవీస్ లో 25.35 కోట్ల షేర్ తో టాప్ లో ఉంటే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) Bro మూవీ 23.61 కోట్లతో ఉంది. వాల్తేరు వీరయ్య 22.90 కోట్ల ఓపెనింగ్స్ ను అందుకోగా…
ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో రీజనల్ మూవీగా బాలయ్య వీర సింహా రెడ్డి టాప్ లో ఉండగా ఇండియన్ మూవీస్ పరంగా కూడా ఈ ఇయర్ 50.12 కోట్ల గ్రాస్ తో టాప్ లో ఉంది, తర్వాత వాల్తేరు వీరయ్య 49.10 కోట్ల గ్రాస్ తో బ్రో మూవీ 48.50 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది..
దాంతో ఇయర్ స్టార్టింగ్ అన్ని సినిమాల కన్నా ముందు రికార్డ్ లెవల్ లో ఓపెన్ అయిన వీర సింహా రెడ్డి డే 1 కలెక్షన్స్ జోరు ఇప్పటికీ కొనసాగుతూ ఉండగా త్వరలో భోళా శంకర్(Bholaa Shankar) తో పాటు మరిన్ని బిగ్ మూవీస్ రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాల ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.