Home న్యూస్ వినయ విధేయ రామ డే 3 కలెక్షన్స్..కొట్టాడు కానీ!!

వినయ విధేయ రామ డే 3 కలెక్షన్స్..కొట్టాడు కానీ!!

0

     మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ తొలిరోజు వసూళ్ళ వరకు దుమ్ము లేపింది అని చెప్పాలి, ఇక రెండో రోజు నుండి సినిమా కి F2 సినిమా నుండి తీవ్ర పోటి ఎదురు అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో లేకున్నా…

సినిమా కి మొదటి రోజు వచ్చిన టాక్ కి పర్వాలేదు అనిపించే విధంగా సినిమా కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి F2 సినిమా ను మరింత జోరుగా పోటి ఎదురు అవ్వడం తొలి రెండు షోల లో ఏమాత్రం జోరు చూపలేకపోయింది.

ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల లో కొంతవరకు పుంజు కున్నా అది పూర్తీ స్థాయి లో లేదనే చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు టోటల్ గా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, ఒక వేల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్..

అనుకున్న రేంజ్ లో ఉంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక పోటి లో ఉన్న మిగిలిన సినిమాల్లో పేట సింగిల్ స్క్రీన్స్ లో పర్వాలేదు అనిపిస్తుండగా ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేదు…ఇక F2….

సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ ను ఏలుతూ రెండో రోజు అన్ని సెంటర్స్ లో అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసి కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది, దాంతో రెండో రోజు సినిమా కలెక్షన్స్ 5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అన్ని సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here