Home న్యూస్ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా – ఫట్టా!!

వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా – ఫట్టా!!

0

    యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, వరల్డ్ వైడ్ గా 1100 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకోగా అక్కడ నుండి సినిమా కి ఫస్ట్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చేసింది. ఆ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా హీరో తన లవ్ స్టొరీ ఫెయిల్ అవ్వడం తో ఒక బుక్ రాయడం మొదలు పెడతాడు, తర్వాత ఆ బుక్ లో లవ్ స్టోరీస్ రాయడం మొదలు పెడతాడు. ఆ స్టోరీస్ ఏంటి… చివరికి హీరో ఏం అయ్యాడు అన్నది స్టొరీ పాయింట్ అని అంటున్నారు.

కథ పాయింట్ ని పక్కకు పెడితే విజయ్ దేవరకొండ తన పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపాడని అంటున్నారు, సీనయ్య రోల్ చాలా బాగా కుదిరిందని అంటున్నారు. మిగిలిన పాత్రలు కూడా మెప్పించాగా ఓవరాల్ గా తన పెర్ఫార్మెన్స్ తో విజయ్ మరోసారి దుమ్ము లేపాడని అంటున్నారు.

ఇక హీరోయిన్స్ లో రాశిఖన్నా మెప్పించాగా ఐశ్వర్య రాజేష్ నటన కూడా మెప్పిస్తుందని, మిగిలిన హీరోయిన్స్ జస్ట్ ఓకే అనిపించారని అంటున్నారు. సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉందని అంటున్నారు. ఇక ఎడిటింగ్ ఫస్టాఫ్ వరకు…

బాగానే అనిపించినా సెకెండ్ ఆఫ్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపలేక పోయిందని అంటున్నారు. సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయని అంటున్నారు. ఇక డైరెక్షన్ పరంగా క్రాంతి మాధవ్ ఫస్టాఫ్ వరకు మెప్పించినా సెకెండ్ ఆఫ్ అంచనాలను అందుకోలేదని అంటున్నారు.

ఫైనల్ గా ఫస్టాఫ్ వరకు బాగానే మెప్పించిన వరల్డ్ ఫేమస్ లవర్ సెకెండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, స్టొరీ మరీ లాగింగ్ గా డ్రాగ్ చేసినట్లు సాగుతుందని, క్లాస్ మూవీస్ ఇష్టపడే వారికి నచ్చే చాన్స్ ఉంటుందని అంటున్నారు… మొత్తం మీద సినిమా కి ప్రీమియర్ షోల నుండి వినిపిస్తున్న టాక్…

ఎబో యావరేజ్ కి అటూ ఇటూ గా ఉందని చెప్పాలి. క్లాస్ మూవీస్ ఇష్టపడే అక్కడ ఇలాంటి టాక్ వస్తే ఇక ఇక్కడ రెగ్యులర్ ఆడియన్స్ సినిమా కి ఫైనల్ గా ఎలాంటి టాక్ చెబుతారు అన్నది ఆసక్తి గా మారింది. రెగ్యులర్ షోల రెస్పాన్స్ చూసి సినిమా రివ్యూ ని అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here