లేటెస్ట్ గా టాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా థియేటర్స్ లో వచ్చి ఉంటే బాగుండేది అని ఎక్కువగా అనుకుంటున్న సినిమా విక్టరీ వెంకటేష్ నటించిన కొత్త సినిమా నారప్ప… తమిళ్ లో బ్లాక్ బస్టర్ అసురన్ తెలుగు రీమేక్ గా రూపొందిన నారప్ప ఆడియన్స్ ముందుకు ముందు మే నెలలో రిలీజ్ అవ్వాల్సింది కానీ సెకెండ్ వేవ్ వలన అలా జరగలేదు. దాంతో పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా…
ఆడియన్స్ ముందుకు డిజిటల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా గురించి రోజుకో కొత్త న్యూస్ బయటికి వస్తుంది. సినిమా కి సాలిడ్ రేటు ఆఫర్ వచ్చిన కారణంగానే డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను చేశారని కొందరు, కాదు థియేటర్స్ లో పరిస్థితులు ఇంకా నార్మల్ అవ్వడానికి…
ఇంకా టైం పట్టేలా ఉన్న కారణంగా రిలీజ్ ను ఇలా ప్లాన్ చేశారని ఇప్పటి వరకు అందరూ అనుకుంటూ ఉండగా సినిమా నిర్మాత సురేష్ బాబు రీసెంట్ గా ఇచ్చిన ప్రెస్ మీట్ లో సినిమా డైరెక్ట్ రిలీజ్ పై కొత్త రీజన్ ను చెప్పారు. సినిమా తమిళ్ ఒరిజినల్ నిర్మాత…
కలైపులి థాను నిర్మించిన లేటెస్ట్ మూవీ కర్ణన్ సినిమా రిలీజ్ అయిన 2 వారాలకే సెకెండ్ వేవ్ వలన పరుగును ఆపాల్సి రావడం తో మొత్తం మీద 15 కోట్ల నష్టం వచ్చిందని, అందువలనే ఆ నష్టాన్ని కవర్ చేయడానికి ఈ సినిమాను డిజిటల్ రిలీజ్ కి సజెస్ట్ చేసి అమెజాన్ ప్రైమ్ వాళ్ళని ఆయనే కాంటాక్ట్ అయ్యి నాకు పరిచయం చేసి డీల్ సెట్ చేశారని….
ఆ సినిమా నష్టాల వలనే ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ అవ్వాల్సి వచ్చిందని తేల్చేశారు. కానీ కర్ణన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ ని బాగానే సొంతం చేసుకుంది, అయినా నష్టం ఏంటి అనేది ఎవ్వరికీ అంతుపట్టకున్నా సురేష్ బాబు చెప్పిన విషయంతో ఇద్దరు నిర్మాతలు ఉండటం ఒక నిర్మాత నష్టాలను పూడ్చడానికే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది అందరికీ క్లియర్ అయిందని చెప్పుకుంటున్నారు ఇప్పుడు అందరూ.