టాలీవుడ్ హీరోల్లో ఎక్కువ శాతం రీమేక్ లు చేసిన హీరోగా విక్టరీ వెంకటేష్ కి పేరుంది. రీమేక్ లు చేసినా ఒరిజినల్ కి మించి నటించడం, ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదే రేంజ్ సక్సెస్ అవ్వడం కూడా వెంకీ మీద ఎప్పుడూ రీమేక్ లు ఎక్కువగా చేస్తారు అన్న అపవాదుని ఏనాడు తీసుకు రాలేదు. కానీ ప్రజెంట్ జనరేషన్ స్టార్స్ కొత్త కొత్త కథలను ఎంచుకుని సినిమాలు చేస్తూ ఉన్న టైం లో…
ఇప్పటికీ వరుస పెట్టి రీమేక్ కథలను ఎంచుకుంటూ ఉండటం పై వెంకటేష్ పై అప్పడప్పుడు కొన్ని విమర్శలు వస్తూ ఉండేవి, వాటన్నింటికీ చెక్ పెట్టేలా రీసెంట్ గా నారప్ప ప్రమోషన్ లో భాగంగా రీమేక్ సినిమాలు ఎందుకని ఎక్కువగా చేస్తున్నారు అనే ప్రశ్న ని మీడియా వాళ్ళు…
వెంకటేష్ ని అడగగా దానికి వెంకటేష్ ఆన్సర్ ఇలా ఇచ్చారు…..రీమేక్ లలో నటించడానికి స్పెషల్ రీజన్ అంటూ ఏమి లేదూ… ఒరిజినల్ కథ నాకు నచ్చడమో లేదా, ఇలాంటి పాత్ర నాకెందుకు రాలేదు అని అనిపించడమో లేదా తెలుగు ఆడియన్స్ కి ఇలాంటి కథ ని అందించాలి అనిపించడమో…
వీటికి తోడూ నిర్మాతలపై మరీ ఎక్కువ ఆర్ధిక భారం పడకుండా రీమేక్ లు హెల్ప్ చేస్తాయని…. అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చని, నారప్ప విషయానికి వస్తే… నా కెరీర్ లోనే ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చేయలేదు, అసురన్ లాంటి సినిమా చూడలేదు కాబట్టి ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నామని అందుకే చేశామని చెబుతూ…రీమేక్ లు చేయడం అన్నది ఇప్పుడు కత్తి మీద సామాని…
ఆల్ రెడీ ఒరిజినల్ ని చూసి ఉంటారు కాబట్టి అది మర్చిపోయేలా మెప్పించడం అన్నది అత్యంత కష్టమని కానీ నాకది ఇష్టమని, నారప్ప విషయం లో అది మరోసారి రుజువు అవుతుందన్న ధీమాతో ఉన్నామని చెప్పుకొచ్చారు వెంకటేష్. నారప్ప ఆడియన్స్ ముందుకు ఈ నెల 20 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.