అల్టిమేట్ క్రేజ్ నడుమ ఉప్పెన మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బరిలోకి దిగబోతుంది, సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ అడ్వాంటేజ్ లు ఉండటం తో కచ్చితంగా టాక్ పాజిటివ్ గా వస్తే మొదటి రోజు…
సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా మొదటి రోజు టాలీవుడ్ తరుపునే కాకుండా హీరోగా మొదటి సినిమాల పరంగా కొత్త రికార్డు ఓపెనింగ్స్ ని అందుకునే ఔట్ రైట్ అవకాశం కూడా పుష్కలంగా ఉంది….
కాగా టాలీవుడ్ తరుపున ఇది వరకు 2007 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిరుత సినిమా ఓపెనింగ్స్ పరంగా 3.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అప్పటి టికెట్ రేట్లతో సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించగా ఆ రికార్డ్ దాదాపు 8 ఏళ్ళు కొనసాగగా అఖిల్ అక్కినేని నటించిన…
మొదటి సినిమా అఖిల్ ది పవర్ ఆఫ్ జువా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 7.6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ తరుపునే కాకుండా ఆల్ ఇండియా లెవల్ లో మొదటి సినిమా తో అత్యధిక కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకున్న హీరోగా రికార్డులను క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఉన్న టికెట్ హైక్స్ అండ్ సాలిడ్ క్రేజ్ చూస్తుంటే ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఈ రికార్డులను అందుకునే అవకాశం అయితే ఉంది, బుకింగ్స్ స్లోగా స్టార్ట్ అవ్వడం ఇబ్బంది పెడుతున్నా కానీ ఆఫ్ లైన్ లో షో షోకి ఇంప్రూవ్ మెంట్ తో సినిమా రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది, ఒకవేళ అది జరిగితే కచ్చితంగా మొదటి రోజు రికార్డులు క్రియేట్ చేయోచ్చు. సేఫ్ సైడ్ లో మినిమమ్ 5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ పక్కాగా అనిపిస్తున్నాయి. మరి ఈ లెక్క మించి తొలి రోజు ఇండియన్ రికార్డ్ కొడుతుందో లేదో చూడాలి ఇక…