ఒక సినిమా ప్రమోషన్ కి సినిమా టీసర్ మరియు ట్రైలర్ లు కూడా చాలా ముఖ్య భూమిక పోషిస్తాయి అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో అయితే దాదాపు ప్రతీ సినిమా కి టీసర్ అండ్ ట్రైలర్ లు రిలీజ్ కి ముందు ప్రమోషన్ కి చాలా ఉపయోగ పడతాయి అని చెప్పొచ్చు.
అలాంటిది ఒక సినిమా మాత్రం ట్రైలర్ కూడా లేకుండానే కేవలం టీసర్ తో సరిపెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా ఇప్పటి వరకు 125 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ని అందుకుంది అంటే ఎంతలా సంచలనం సృష్టించిందో అర్ధం చేసుకోవచ్చు.
ఆ సినిమానే విజయ్ దేవరకొండ రష్మికల కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం సినిమా. కేవలం టీసర్ మాత్రమె రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ లేకుండానే రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వారాల్లో 69 కోట్లకు పైగా షేర్ ని 125 కోట్ల గ్రాస్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ ను నెలకొల్పింది. ట్రైలర్ కూడా లేకుండా రిలీజ్ అయ్యి ఏకంగా ఈ రేంజ్ లో 125 కోట్లు వసూళ్లు సాధించిన ఏకైక టాలీవుడ్ సినిమాగా నిలిచింది ఈ సినిమా.