Home న్యూస్ రేపటి నుండే వరల్డ్ కప్…భారత్ కి ఓపెనర్ల ఫామ్ బెడద!

రేపటి నుండే వరల్డ్ కప్…భారత్ కి ఓపెనర్ల ఫామ్ బెడద!

0

రేపటి నుండి వండే వరల్డ్ కప్ మొదలు కానుంది, అన్ని టీమ్స్ తమ తమ బలాలతో సిద్ధం అవ్వగా ఇండియా విషయానికి వస్తే మిడిల్ ఆర్డర్ బౌలింగ్ లైనప్ బాగున్నా కానీ ఓపెనర్స్ ఫామ్ మాత్రం కలవర పెడుతుంది. గత కొంత కాలంగా ఓపెనింగ్స్ వరుసగా విఫలం అవుతూ వస్తుండటం తో కొహ్లీ పై ఎక్కువ ప్రెజర్ పడుతుంది.

కానీ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో ఉన్న కోహ్లి, రాహుల్, ధోని మరియు పాండ్య లు ఫామ్ లో ఉండటం తో మిడిల్ ఆర్డర్ అద్బుతంగా ఉంది, ఇక బౌలింగ్ విషయం లో బుమ్రా సూపర్ ఫామ్ లో ఉండగా చాహల్ మరియు కుల్దీప్ లు కూడా ఫామ్ లో ఉన్నారు.

మిడిల్ ఆర్డర్ అండ్ బౌలింగ్ బాగున్నా భారీ స్కోర్స్ నమోదు అయ్యే ఇంగ్లాండ్ పిచ్ ల పై ఓపెనర్స్ ఫామ్ లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓపెనర్స్ ఫామ్ లో కి వస్తే టైటిల్ వేట లో భారత్ మరింత ముందు నిలిచే అవకాశం ఉంటుంది, ఇక వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ హోమ్ టీం ఇంగ్లాండ్ కి సౌత్ ఆఫ్రికా కి మధ్య జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here