బాక్స్ ఆఫీస్ దగ్గర లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని వీకెండ్ లో బాక్స్ అఫీస్ సక్సెస్ అనిపించుకున్న సినిమా రైటర్ పద్మభూషణ్… హార్ట్ టచింగ్ స్టొరీతో వచ్చిన ఈ సినిమాను మేకర్స్ యూనిక్ వే లో ప్రమోషన్స్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ కూడా బాగానే ఉండటంతో అవన్నీ కలిసి వచ్చి మంచి వసూళ్ళని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం.
సినిమాను మొత్తం మీద తక్కువ బడ్జెట్ తోనే తెరకేక్కించగా ఇప్పుడు నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ కలెక్షన్స్ తో మేకర్స్ కి అద్బుతమైన లాభాలను సొంతం అయ్యేలా చేసిందని చెప్పాలి… సినిమాను మొత్తం మీద ప్రమోషన్స్ తో కలిపి ఓవరాల్ గా 4 కోట్ల లోపు…
బడ్జెట్ తో నిర్మించిన మేకర్స్ కి గుడ్ ప్రమోషన్స్ వలన ఆ మొత్తం ఏకంగా డిజిటల్ రైట్స్ తోనే సొంతం అయ్యింది. ఇక థియేట్రికల్ బిజినెస్ ఓన్ గానే జరగగా శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్ ఇవన్నీ కూడా మేకర్స్ కి ఇప్పుడు ప్రాఫిట్స్ లో భాగం అని చెప్పొచ్చు….
శాటిలైట్ రైట్స్ 2 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తూ ఉండగా థియేట్రికల్ రన్ లో 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉన్న సినిమా టోటల్ గా 4 కోట్ల బడ్జెట్ మీద 10 కోట్ల నుండి 11 కోట్ల రేంజ్ లో రికవరీ ని సొంతం చేసుకోబోతుండగా మేకర్స్ కి ఆల్ మోస్ట్ 7 కోట్ల కి అటూ ఇటూగా లాభాలను సొంతం అయ్యేలా చేయబోతుంది.