మన దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ ఒక ఊపు ఊపేసిన తర్వాత కొంచం ట్రెండ్ వీక్ అయినా అప్పుడప్పుడు కొన్ని సినిమాలు మంచి కలెక్షన్స్ తోనే రచ్చ చేస్తూ ఉండగా, ఇతర చోట్ల మాత్రం ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మంచి జోరు అందుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి…లేటెస్ట్ గా బాలీవుడ్ లో ఈ జోరు మంచి స్పీడ్ మీద ఉంది…
తుంబాద్ మూవీ రీ రిలీజ్ లో సాలిడ్ కలెక్షన్స్ తో రికార్డులు క్రియేట్ చేసిన తర్వాత లేటెస్ట్ గా 2013 టైంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ యే జవానీ హై దివానీ(Yeh Jawaani Hai Deewani Movie) రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వగా…
హిందీ తో పాటు సౌత్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ తో వీకెండ్ ని పూర్తి చేసుకుంది. సినిమా వచ్చి ఆల్ మోస్ట్ 12 ఏళ్ళు అవ్వగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ లో వీకెండ్ అయ్యే టైంకి ఆల్ మోస్ట్ 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సినిమా మాస్ రచ్చ చేసింది…
ఆల్ మోస్ట్ 6.60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ వీకెండ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా….సండే రోజున ఏకంగా 3.10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేయడంతో ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా హిందీలో…
మంచి కలెక్షన్స్ తో జోరు కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..రీ రిలీజ్ లాంగ్ రన్ లో సినిమా 20 కోట్ల మార్క్ ని టార్గెట్ చేసింది అని చెప్పాలి ఇప్పుడు…. ఓవరాల్ గా బాలీవుడ్ లో కూడా రీ రిలీజ్ ల ట్రెండ్ కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.