Home Uncategorized జాంబి రెడ్డి ఫస్ట్ డే కలెక్షన్స్…సెన్సేషనల్ కలెక్షన్స్!

జాంబి రెడ్డి ఫస్ట్ డే కలెక్షన్స్…సెన్సేషనల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ ఇండస్ట్రీ కరోనా తర్వాత గట్టిగా కంబ్యాక్ ఇచ్చింది. సంక్రాంతి సినిమాలు సంచలనాలు సృష్టించిన తర్వాత కూడా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపుతున్నాయి. రీసెంట్ గా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తర్వాత ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర డిఫెరెంట్ కాన్సెప్ట్ తో రిలీజ్ అయిన జాంబి రెడ్డి సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ తో జోరు చూపుతూ దూసుకు పోతుండటం విశేషం…

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజుకి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కూడా ఏమంత ఆశాజనకంగా అయితే లేవు, దాంతో ఓపెనింగ్స్ పై ఇది ఇంపాక్ట్ గట్టిగానే చూపుతుంది అనుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గరకి వచ్చే సరికి సినిమా రిలీజ్ రోజున ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరు…

చూపుతూ దూసుకు పోతుంది. మాస్ సెంటర్స్ లో ఫుల్ జోష్ తో దూసుకు పోతుంది ఈ సినిమా. ఓవరాల్ గా థియేటర్స్ కౌంట్ కూడా సాలిడ్ గానే ఉండగా సినిమా ఓవరాల్ గా ఇప్పుడు మంచి వసూళ్ళనే సాధించే అవకాశం ఉంది. కానీ టికెట్ హైక్స్ లేక పోవడం తో ఆ ఇంపాక్ట్ కొంచం ఉండే అవకాశం ఉంది.

మొత్తం మీద మార్నింగ్ మ్యాట్నీ షోల బుకింగ్స్ తర్వాత సినిమా 50 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ని అనుకున్నా ఈవినింగ్ షోల జోరు చూస్తుంటే ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 80 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది. కంప్లీట్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని చోట్లా అనుకూలంగా ఉంటె ఈ లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు.

టికెట్ హైక్స్ ఉండి ఉంటె ఈ లెక్క మరింత ఎక్కువగా ఉండి ఉండేది, కానీ టికెట్ హైక్స్ లేకున్నా సినిమా మంచి ఓపెనింగ్స్ నే మొదటి రోజు సొంతం చేసుకోబోతుంది. బుకింగ్స్ సరిగ్గా లేకున్నా మొదటి రోజు షో షోకి ఇంప్రూవ్ మెంట్ తో ఇప్పుడు సాలిడ్ ఓపెనింగ్స్ తో షాక్ ఇవ్వబోతుంది ఈ సినిమా. మరి ఈ అంచనాలను అందుకుంటుందా లేక మించుతుందా అనేది ఫస్ట్ డే కలెక్షన్స్ తో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here