బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని వీకెండ్ లో సొంతం చేసుకుంది కానీ తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం సినిమా అంచనాలను అందుకునే రేంజ్ లో కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకోలేక పోయింది… కానీ వీకెండ్ లో భారీ వసూళ్లు రావడంతో అందుకోవాల్సిన టార్గెట్ లో…
చాలా వరకు రికవరీ అవ్వడంతో మిగిలిన రన్ లో సినిమా ఇంకొంచం హోల్డ్ చేయాల్సిన అవసరం ఉండగా సెకెండ్ వీకెండ్ లో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో జస్ట్ ఓకే అనిపించేలా ఓపెన్ అవ్వగా గ్రోత్ కూడా ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా బెటర్ గా…
హోల్డ్ చేయాల్సిన అవసరం ఉండగా 10 వ రోజు సినిమా 60 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉందని భావించగా మొత్తం మీద సినిమా కొంచం జోరు పెంచి 81 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 10 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 7.92Cr
👉Ceeded: 6.30Cr
👉UA: 4.73Cr
👉East: 3.81Cr
👉West: 2.70Cr
👉Guntur: 3.21Cr
👉Krishna: 2.08Cr
👉Nellore: 1.64Cr
AP-TG Total:- 32.39CR(52.47Cr~ Gross)
👉Ka+ROI: 1.68Cr
👉OS – 1.42Cr
Total WW: 35.49CR(59.50CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క.
సినిమాను మొత్తం మీద 38.15 కోట్లకు అమ్మగా 39 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకా 3.51 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, అంటే ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఇంకా జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సినిమా కి…