Home న్యూస్ ఎపిక్ ఫాంటసీ మూవీ…150 కోట్లు ఏంటి సామి అసలు!!

ఎపిక్ ఫాంటసీ మూవీ…150 కోట్లు ఏంటి సామి అసలు!!

0

2010 లో టాలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో ఓ డబ్ మూవీ కి మంచి హైప్ వచ్చింది, ఎవరో ఎవరో కొత్తోడు, టోటల్ గా తమిళ్ ఫ్లేవర్ అయినా కానీ ఆడియన్స్ ఆ సినిమా ని ఇక్కడ ఆదరించారు, అది కూడా ఓన్ తమిళ్ భాష కి మించి తెలుగు లో విజయాన్ని కట్టిపెట్టారు. ఆ సినిమానే సూర్య తమ్ముడు కార్తి నటించిన యుగానికి ఒక్కడు మూవీ. సోషియో ఫాంటసీ కథ నే అయినా కానీ…

అడ్వెంచర్ గా కథ ని మార్చి దర్శకుడు సెల్వ రాఘవన్ సినిమా ను ఓ రేంజ్ లో తెరకెక్కించాడు. అప్పుడు తమిళ్ వాళ్ళకి ఎక్కలేక పోయిన ఈ సినిమా తర్వాత వాళ్ళ దృష్టి లో ఓ క్లాసిక్ ఎపిక్ మూవీ గా నిలిచిపోయింది, కార్తికి తెలుగు లో మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది.

సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తీ అవ్వగా ఇప్పుడు డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఈ ఎపిక్ క్లాసిక్ అడ్వెంచర్ మూవీ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం వచ్చిన యుగానికి ఒక్కడు సినిమా కి అప్పట్లోనే ఏకంగా 32 కోట్ల బడ్జెట్ లో తీశారని టాక్.

కానీ తమిళ్ లో పెద్దగా వర్కౌట్ కాని సినిమా తెలుగు లో మాత్రం 4.5 కోట్ల బిజినెస్ 6 కోట్లకు పైగా షేర్ అందుకుని సూపర్ హిట్ అనిపించుకుంది. కానీ ఇప్పుడు రూపొందే సీక్వెల్ కోసం ఆడియన్స్ కూడా భారీగా ఆశగా ఎదురు చూస్తుండటంతో మరింత స్పెషల్ గా సినిమా ని తీయాలి అనుకుంటున్న డైరెక్టర్ సెల్వ రాఘవన్ సీక్వెల్ కి ఈ సారి 150 కోట్ల రేంజ్ లో…

బడ్జెట్ అవసరం అవుతుందని, అప్పుడే ప్రస్తుత టెక్నాలజీ కి తగ్గట్లు సినిమా విజువల్ వండర్ గా తీయగలమని చెబుతున్నాడట. కానీ ప్రస్తుత ఫాం డైరెక్టర్ కి అంత బడ్జెట్ తెచ్చిపెట్టలేక పోతుందని అంటున్నారు. నిర్మాత దొరికిన వెంటనే సినిమా పట్టాలు ఎక్కుతుందని చెబుతున్నారు. మరి నిర్మాత ఎప్పుడు దొరుకుతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here