రికార్డుల భీభత్సం సృష్టిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 227.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా ఎపిక్ 952 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా ఇప్పుడు మొదటి వారాన్ని…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోబోతుంది. సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కుమ్మేస్తూ 8.5-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక హిందీలో సినిమా 6వ రోజు రేంజ్ లో కొంచం హెవీగా డ్రాప్ కాకుంటే ఓవరాల్ గా 7వ రోజు 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్ అండ్ కేరళ కలిపి సినిమా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో…
1 మిలియన్ లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉండగా….టోటల్ గా 7వ రోజు వరల్డ్ వైడ్ గా 48-50 కోట్లకి అటూ ఇటూగా గ్రాస్ ను ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఈ కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 237 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా అందరి అంచనాలను మించిపోతూ ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల మార్క్ ని అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకోబోతుంది…ఇండియన్ సినిమా హిస్టరీలో…
బిగ్గెస్ట్ రికార్డులతో ఈ సినిమా మాస్ ఊచకోత కోసింది అని చెప్పాలి. ఫైనల్ లెక్కలు ఇప్పుడు ఎంతవరకు వెళతాయి అన్నది ఆసక్తిగా మారగా రెండో వీక్ లో సినిమా హోల్డ్ ని చూపిస్తే గనుక సినిమా మరిన్ని భీభత్సమైన రికార్డులను నమోదు చేయోచ్చు. ఇక టోటల్ గా మొదటి వారంలో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.