బాక్స్ ఆఫీస్ దగ్గర శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాక్టర్ సెకెండ్ వేవ్ తర్వాత ఇండియా లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడమే కాదు హీరో శివ కార్తికేయన్ కెరీర్ లో కూడా ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన సినిమా గా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది… సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ…
2 వారాలు పూర్తీ అయ్యి మూడో వారం లో రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పటి వరకు 85.3 కోట్ల గ్రాస్ ని అందుకోగా 18 వ రోజు తెలుగు లో 4 లక్షల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేయడం తో టోటల్ వరల్డ్ వైడ్ గా…
సినిమా ఇప్పుడు 86.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని 45.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. సినిమా ఇప్పటికీ హోల్డ్ చేసిన తీరుని చూసి లాంగ్ రన్ లో 100 కోట్ల మైలు రాయి ని సినిమా అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని…
ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా ఈ లోపు సినిమా యూనిట్ ఈ 100 కోట్ల ఆశలపై నీళ్ళు చల్లింది… సినిమా డిజిటల్ లో రిలీజ్ కి డేట్ ని ఫిక్స్ చేసి 100 కోట్లకు అడ్డుగా నిలిచారు. సినిమాను నవంబర్ 4 న సన్ నెక్స్ట్ లో అలాగే నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ చేయబోతున్నట్లు కన్ఫాం అవ్వడం తో థియేటర్స్ లో ఆక్యుపెన్సీ ఆటోమాటిక్ గా తగ్గిపోతుంది…
దాంతో ఇప్పుడు సినిమా 100 కోట్ల మార్క్ ని అందుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని, మేకర్స్ ముందే అగ్రిమెంట్స్ చేసుకోవడం తో ఇప్పుడు ఆ డేట్ కి సినిమా డిజిటల్ రిలీజ్ కన్ఫాం అవ్వడంతో బాక్స్ ఆఫీస్ రన్ త్వరలోనే ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. కొంచం డిలే చేసి ఉంటే సినిమా దీపావళి టైం కి 100 కోట్లను అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉండేదని చెప్పొచ్చు.