Home న్యూస్ 10 డేస్ 21M***….సడెన్ గా లెక్కలు మారుస్తున్న మంచు విష్ణు!!

10 డేస్ 21M***….సడెన్ గా లెక్కలు మారుస్తున్న మంచు విష్ణు!!

0

చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్న సినిమాల్లో ఒకటి మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) సినిమా కూడా ఒకటి….సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉండటం…అందునా పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) స్పెషల్ రోల్ లో నటిస్తూ ఉండటంతో సినిమా మీద అంచనాలు ఏర్పడినా…

మంచు విష్ణు రీసెంట్ మూవీస్ అన్నీ దెబ్బ పడటం…దాంతో పాటు వార్తల్లో ఎక్కువ శాతం ట్రోల్స్ ఎక్కువగా సొంతం చేసుకుంటున్న మంచు విష్ణు నుండి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ అవ్వడం, మొదటి టీసర్ ట్రోల్ స్టఫ్ అవ్వడం లాంటివి ఇంపాక్ట్ చూపించినా…

సినిమా నుండి వచ్చిన సాంగ్స్ మంచి రీచ్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా టీసర్2 అనుకున్న దానికి మించి మెప్పించడంతో ఆడియన్స్ లో సినిమా మీద సడెన్ గా బజ్ పెరుగుతూ వెళుతూ ఉండగా…టీసర్ 2 ఉన్నట్లు సినిమా కూడా..

ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా…టీసర్ 2 కూడా సాలిడ్ రీచ్ నే సొంతం చేసుకుంటూ ఉండగా…తెలుగు వర్షన్ టీసర్ మంచు విష్ణు కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ వ్యూస్ తో..

దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా టీసర్ వచ్చిన 10 రోజుల టైంకే ఏకంగా 21 కి పైగా మిలియన్స్ లో వ్యూస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం… లైక్స్ పరంగా 235K లైక్స్ మార్క్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకుని కుమ్మేసింది ఈ టీసర్…

ఇక సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన కొత్త సాంగ్ కూడా మెప్పించగా…సడెన్ గా సినిమా మీద ఆడియన్స్ లో కొంచం బెటర్ గా అంచనాలు పెరుగుతూ ఉండటంతో ఇక ట్రైలర్ ఒక్కటి పెర్ఫెక్ట్ గా వస్తే వచ్చే నెల 25న సినిమా మంచి జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here