Home న్యూస్ 118- డే 3 ఓపెనింగ్స్…మైండ్ బ్లోయింగ్!

118- డే 3 ఓపెనింగ్స్…మైండ్ బ్లోయింగ్!

0

     నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 118 బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, అన్ సీజన్ అవ్వడం తో కలెక్షన్స్ మరీ గొప్పగా కనిపించక పోయినా ఈ పరిస్థితుల్లో సినిమా సాధిస్తున్న హోల్డ్ అండ్ కలెక్షన్స్ గొప్పే అని చెప్పాలి. సినిమా మొదటి రోజు 1.8 కోట్ల షేర్ ని రెండో రోజు 1.5 కోట్ల షేర్ ని అందుకుని సూపర్బ్ గా హోల్డ్ చేయగా….

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో 3.3 కోట్ల రేంజ్ షేర్ అందుతున్న తర్వాత సినిమా మూడో రోజు కూడా సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసి మైండ్ బ్లోయింగ్ అనిపించే కలెక్షన్స్ ని అందుకునే దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతుంది, కాగా ఇక్కడ విశేషం ఏంటి అంటే…

సినిమా రెండో రోజు తో పోల్చితే మూడో రోజు ఓపెనింగ్స్ లో కేవలం 15% వరకు మాత్రమె డ్రాప్స్ ని తొలి రెండు షోల కి సొంతం చేసుకోవడం, ఇది నిజంగానే గొప్ప విషయం అని చెప్పాలి. రీసెంట్ టైం లో సంక్రాంతి సినిమాల్లో ఒకటి రెండు తప్పితే… మిగిలిన టైం లో మరే…

సినిమా కూడా అతి తక్కువ డ్రాప్స్ తో వీకెండ్ ని కొనసాగించలేదు. కాగా రోజు మొత్తం మీద ఇదే రేంజ్ లో ట్రెండ్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మరో సారి కోటి దాటే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటె…

ఈ లెక్క మళ్ళీ 1.2 కోట్ల రేంజ్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో కూడా లోకేషన్స్ భారీ గా పెంచడం తో అక్కడ కూడా కలెక్షన్స్ పెరిగాయి, మరి రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here