బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో సాధిస్తున్న కలెక్షన్స్ అంతగా ఇంపాక్ట్ ఫుల్ గా అనిపించని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ అయిన పుష్ప2(Pushpa2 Movie) రెండో వీకెండ్ ని ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది…
సినిమా హిందీలో చూపిస్తున్న జోరు ముందు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ తేలిపోయినట్లు అనిపించినా కూడా ఇక్కడ కూడా సినిమా మంచి హోల్డ్ తోనే పరుగును కొనసాగిస్తున్న సినిమా రెండో వీకెండ్ లో మంచి జోరు చూపించినా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజున అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి మాస్ ఊచకోత కోసింది…సినిమా 11వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 12.25 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 11 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 87.06Cr
👉Ceeded: 28.81Cr
👉UA: 21.56Cr
👉East: 11.55Cr
👉West: 9.01Cr
👉Guntur: 14.21Cr
👉Krishna: 11.64Cr
👉Nellore: 6.99Cr
AP-TG Total:- 190.83CR(282.60CR~ Gross)
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నప్పటికీ పుష్ప2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా 24 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సినిమా రెండో వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో స్టడీ హోల్డ్ ని చూపించి క్రిస్టమస్ వీకెండ్ లో గ్రోత్ ని చూపిస్తే కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన టార్గెట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో సినిమా ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.