ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక చేతులు ఎత్తేయడంతో ఆడియన్స్ కి తిరిగి లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(Ka Movie), దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) లక్కీ భాస్కర్(Lucky Baskhar) మరియు శివ కార్తికేయన్(Siva Kartikeyan) అమరన్(Amaran) సినిమాలు…
మాత్రమే బెటర్ ఆప్షన్ గా మారగా వీకెండ్ లో అన్ని సినిమాలు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతున్నాయి…..తెలుగు రాష్ట్రాల్లో మరోసారి అన్ని సినిమాలు 11వ రోజు సండే అడ్వాంటేజ్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
క మూవీ మరోసారి ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 90-1 కోటి రేంజ్ లో షేర్ ని 11వ రోజున సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర లక్కీ భాస్కర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తూ ఉండగా తమిళనాడు అండ్ కేరళలో కూడా రచ్చ చేస్తుంది. తెలుగు రాష్ట్రలలో 1-1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా మరోసారి 6-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే…
అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు, ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ అంచనాలను ఇంకా మించే అవకాశం ఉంది. ఇక అమరన్ మూవీ ఇక్కడా అక్కడా అని లెక్క లేకుండా అన్ని చోట్లా మాస్ ఊచకోత కోస్తుంది. సినిమా 11వ రోజు తెలుగు రాష్ట్రలలో ఓవరాల్ గా 1.3 కోట్ల రేంజ్ కి…
అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, తమిళ్ లో రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 11వ రోజున 20-22 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం మరోసారి ఎంతైనా ఉంది. ఇక అన్ని సినిమాలు ఈ అంచనాలను మించుతాయో లేక ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటాయో చూడాలి ఇప్పుడు.