యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత 11 వ రోజు అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… ఆల్ మోస్ట్ 10 వ రోజు తో పోల్చితే….
11 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 70% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోవడం విచారకరం అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పార్షిక హాలిడే ఉండటంతో ఆల్ మోస్ట్ 11 వ రోజు లెవల్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ….
పరుగును కొనసాగిస్తుంది అని చెప్పాలి. సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోల టైం కి ఆల్ మోస్ట్ 15-20% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కొంచం బెటర్ గా కొనసాగుతూ ఉండగా సినిమా ఉన్నంతలో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 3.8 కోట్ల నుండి…
4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇక హిందీ లో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి… ఇక కర్ణాటక, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో మొత్తం మీద 2 కోట్ల నుండి 2.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది….
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ ఇండియా లో 12వ రోజు 8.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా 11-12 కోట్ల రేంజ్ దాకా వెళితే ఈ రోజు బాగా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఓవరాల్ గా ఎంత వరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…