దసరా సినిమాలు అన్నీ కూడా రెండో వీకెండ్ ని పూర్తి చేసుకుని ఇప్పుడు తిరిగి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాయి… కాగా సినిమాలు అన్నీ వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ రోజు అన్ని సినిమాలు కూడా ఈ రోజు డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్నాయి.
రవితేజ(Raviteja) నటించిన టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా 11వ రోజు మొత్తం మీద 10వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 60-70% రేంజ్ లో డ్రాప్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కనిపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు సినిమా మొత్తం మీద 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక విజయ్(Thalapathy Vijay) నటించిన లియో(LEO Movie) 12వ రోజులో ఎంటర్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ టైగర్ నాగేశ్వరరావు రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా ఈ రోజు మొత్తం మీద 25 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు.
ఇక బాలకృష్ణ(Balakrishna) నటించిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు 11వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 60-65% రేంజ్ లో డ్రాప్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండటంతో ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా….
80-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కోటి రేంజ్ లో అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు, ఇక లియో మూవీ వరల్డ్ వైడ్ గా 8-10 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోవచ్చు. ఇక అన్ని సినిమాల ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.