Home న్యూస్ పవర్ స్టార్ బిగ్గెస్ట్ కంబ్యాక్ గబ్బర్ సింగ్ కి 12 ఏళ్ళు…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!

పవర్ స్టార్ బిగ్గెస్ట్ కంబ్యాక్ గబ్బర్ సింగ్ కి 12 ఏళ్ళు…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా అల్టిమేట్ క్రేజ్ ఉన్న అతి కొద్ది మంది స్టార్స్ లో ముందు నిలిచే హీరో….ఖుషి తర్వాత మళ్ళీ అలాంటి హిట్ లేకున్నా జల్సా మరీ అంచనాలను అందుకోలేక పోయినా కూడా మధ్యలో ఎన్ని ఫ్లాఫ్స్ వచ్చిన పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు…

జల్సా తర్వాత కూడా వరుస ఫ్లాఫ్స్ పడిన తర్వాత హిందీ లో సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన దబంగ్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ సినిమా రీమేక్ రైట్స్ ను తీసుకుని తెలుగు వాళ్ళకి నచ్చేలా మార్పులతో గబ్బర్ సింగ్(Gabbar Singh) అంటూ 2012 టైంలో సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి కెరీర్ లోనే…

బిగ్గెస్ట్ కంబ్యాక్ ఆ టైంలో సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్….సినిమా ఫస్ట్ టీసర్ నుండే హైప్ పెంచేసిన ఈ సినిమా తర్వాత సాంగ్స్ ఓ రేంజ్ లో హిట్ అవ్వడంతో మరో లెవల్ క్రేజ్ కి వెళ్ళగా రిలీజ్ అయిన తర్వాత ఒరిజినల్ కన్నా కూడా బెటర్ గా ఉంది అనిపించుకునే సక్సెస్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర…

సెన్సేషనల్ కలెక్షన్స్ తో 60 కోట్లకు పైగా షేర్ ని అందుకుని అప్పటికి మగధీర(Magadheera) తర్వాత హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. అలాంటి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 12 ఏళ్ళు అవ్వగా ఇప్పటికీ గబ్బర్ సింగ్(#12YearsForGabbarSingh) అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పొచ్చు….

పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్, సెకెండ్ ఆఫ్ లో అంత్యాక్షరి ఎపిసోడ్, కెవ్వు కేక సాంగ్, ఇంటర్వెల్ ఎపిసోడ్ ఇలా సినిమాలో హైలెట్ సీన్స్ చాలానే ఉన్నాయి అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి కంబ్యాక్ ను అప్పట్లో ఫ్యాన్స్ ఎక్స్ పెర్ట్ చేశారో సరైన సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్..

ఆ టైంలోనే ఆల్ మోస్ట్ 34 కోట్ల రేంజ్ దాకా బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో ఏకంగా 60 కోట్లకు పైగా షేర్ ని అందుకుని బిజినెస్ మీద 26 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది …అలాంటి గబ్బర్ సింగ్ వచ్చి 12 ఏళ్ళు కంప్లీట్ అవ్వగా పవన్ నుండి ఫ్యూచర్ లో మరొక్కరి ఇలాంటి కంప్లీట్ కమర్షియల్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here