Home న్యూస్ 130 కోట్లు ఊదేసిన ఐకాన్ స్టార్…ఇది కదా జాతర అంటే!!

130 కోట్లు ఊదేసిన ఐకాన్ స్టార్…ఇది కదా జాతర అంటే!!

0

గంట గంటకి సెన్సేషనల్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ మమ్మోత్ రికార్డులను నమోదు చేయడానికి సిద్ధం అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా…మరి కొన్ని గంటల్లో అన్ని చోట్లా సంచలన కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా…

సినిమాకి అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఇండియన్ మూవీస్ లో బిగ్గెస్ట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఓవర్సీస్ లో ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో 4.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది….

ఇండియన్ కరెన్సీ లో ఓవరాల్ గా సినిమా 38 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాలిడ్ గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా, ఓవరాల్ గా బ్లాక్ చేసిన సీట్స్ తో ఓవరాల్ గా బుకింగ్స్ 48 కోట్ల మార్క్ ని దాటేసింది…

ఇక టోటల్ తెలుగు వర్షన్ ఇండియా గ్రాస్ 53 కోట్ల మార్క్ ని అందుకోగా హిందీ వర్షన్ మొత్తం మీద 32 కోట్ల మార్క్ ని దాటేసింది…ఇక ఇతర సౌత్ భాషల వర్షన్ లు కలిపి లెక్క 7 కోట్ల లోపు ఉండగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ గ్రాస్ లెక్క ఏకంగా…

130 కోట్ల మార్క్ ని టచ్ చేసి తుక్కు రేగ్గొడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ రేంజ్ లో రిలీజ్ అవ్వడంతో ఆ రేంజ్ లో ఫుల్స్ పడకపోయినా కూడా భారీ టికెట్ హైక్స్ ఉండటంతో ఫుల్స్ లేకపోయినా కలెక్షన్స్ మాత్రం రికార్డులు నమోదు చేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here