బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా రిమార్కబుల్ హోల్డ్ తో రెండో వీక్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతుంది. సినిమా కి 13వ రోజున సండే అలాగే రిపబ్లిక్ డే హాలిడే కూడా కలిసి రావడంతో…
అన్ని చోట్లా ఊరమాస్ హోల్డ్ ని చూపెడుతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషమని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు మీద మంచి గ్రోత్ ని చూపెడుతూ ఉండగా, ఆఫ్ లైన్ లో కూడా ఎక్స్ లెంట్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది.
ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5 కోట్ల రేంజ్ నుండి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 6 కోట్ల దాకా వెళ్ళే ఛాన్స్ ఎంతైనా ఉంది. ఒకవేళ ఈ మార్క్ ని కూడా మించితే భీభత్సమే అని చెప్పాలి.
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో కలిపి సినిమా మొత్తం మీద 13వ రోజున 7 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది…
ఓవరాల్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ తో సినిమా 13వ రోజున వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి. మిగిలిన రన్ లో సినిమా బాక్స్ అఫీస్ దగ్గర లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి. ఇక టోటల్ గా 13 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.