బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ మాస్ హోల్డ్ ని చూపిస్తూ ఎక్స్ లెంట్ రన్ ని కొనసాగిస్తున్న విరూపాక్ష సినిమా 11వ రోజు మొదటి సారిగా కోటి లోపు షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా 12వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి హోల్డ్ నే చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
మొత్తం మీద సినిమా 11వ రోజు తో పోల్చితే బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజున 25-30% రేంజ్ లో డ్రాప్స్ ను ఇప్పుడు సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు అటూ ఇటూగా 45 లక్షల నుండి 50 లక్షల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించి పొతే ఈ కలెక్షన్స్ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
70 లక్షల నుండి 75 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓ మీడియం రేంజ్ మూవీ కి 13వ రోజు ఇలాంటి హోల్డ్ ఉండటం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా 13 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.