రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా అల్టిమేట్ ట్రెండ్ లో 13వ రోజున దుమ్ము లేపే రికార్డులను సృష్టించిన తర్వాత 14వ రోజున తిరిగి వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టింది…
కాగా ఫుల్ వర్కింగ్ డే అవ్వడంతో ట్రాక్ చేసిన సెంటర్స్ లో డ్రాప్స్ హెవీగానే ఉన్నాయి అని చెప్పాలి. ఆల్ మోస్ట్ సండే తో పోల్చితే మండే డ్రాప్స్ 75-80% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ కొంచం పర్వాలేదు అనిపించేలా ఉండగా ఓవరాల్ గా…
సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి..
సినిమా ఒకవేళ 2.2 కోట్లు ఆ పైన కనుక షేర్ ని రాబట్టగలిగితే ఎక్స్ లెంట్ గా 14వ రోజును హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు…ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.3-2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా…
ఉండే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండటంతో ఈ వీక్ వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 2 వారాల్లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.