టెంపర్ నుండి నాన్ స్టాప్ గా 5 సినిమాలుగా ఒక్క అపజయం లేకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ గ్యాప్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ కోసం తీసుకోవడంతో సోషల్ మీడియా లో రీసెంట్ టైం లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ యాక్టివ్ గా ఉండటం ఆపేశారు. కొద్ది సమయంలో మాత్రమె సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్న ఫ్యాన్స్ మళ్ళీ రీ ఎంట్రీ సాలిడ్ గా ఇచ్చారు.
వీళ్ళు ఇచ్చిన గ్యాప్ లో సోషల్ మీడియా లో చాలా రికార్డులు నమోదు అవ్వగా రీ ఎంట్రీ ఇచ్చిన ఫ్యాన్స్ గత 15 20 రోజుల్లో సోషల్ మీడియా లో మూడు సాలిడ్ రికార్డులను సొంతం చేసుకుని సత్తా చాటుకున్నారు, అవన్నీ ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ లో భాగం అవ్వడం విశేషం…
ముందుగా అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ కి సిద్ధం అవుతున్న సమయం లో కామన్ డిస్ప్లే ట్రెండ్ ని మొదలు పెట్టగా అడ్వాన్స్ ట్రెండ్ తో అది వరకు CDP ట్రెండ్ లో టాప్ లో పవన్ కళ్యాణ్ ట్రెండ్ ను బ్రేక్ చేశారు. తర్వాత ఈ రికార్డ్ అజిత్ ఫ్యాస్స్ మెయిన్….
CDP ట్రెండ్ లో బ్రేక్ చేసి 4.6 మిలియన్ ట్వీట్స్ ని పోల్ చేశారు. ఇక తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇన్ని రోజుల్లో పుట్టిన రోజు అని జరుపుకునే అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ ను మే 1 న నిర్వహించగా 24 గంటల్లో ఏకంగా 8.45 మిలియన్ ట్వీట్స్ తో సంచలన రికార్డ్ నమోదు చేశారు. పాత రికార్డ్ పవన్ ఫ్యాన్స్ 2.4 మిలియన్స్ గా ఉంది.
ఇక చివరగా మెయిన్ CDP ట్రెండ్ లో అజిత్ ఫ్యాన్స్ నెలకొల్పిన 4.6 మిలియన్ ట్వీట్స్ ని బ్రేక్ చేసి 5.2 మిలియన్స్ వరకు ట్వీట్స్ ని పోల్ చేసి మూడో రికార్డ్ ను నమోదు చేశారు. ఇక ఈ నెల 20 న ఎన్టీఆర్ బర్త్ డే ఉండటం తో బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ 10.51 మిలియన్ రికార్డ్ పై కన్నేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మరి బ్రేక్ చేస్తారో లేదో చూడాలి…