సరిగ్గా 15 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో మోస్ట్ హైప్ తో వచ్చిన ఎపిక్ మగధీర(Magadheera Movie) అప్పటికి టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందగా…ఆ బడ్జెట్ కి ఏమాత్రం తీసిపోని భారీ రికార్డ్ బిజినెస్ ను సాధించి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఆ రేంజ్ బిజినెస్ ను రికవరీ చేస్తుందా అన్న అనుమానాల నడుమ…
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది…తొలి ఆటకే ఏకంగా ఇండస్ట్రీ హిట్ రేంజ్ బొమ్మ అనిపించుకునే టాక్ ను సొంతం చేసుకున్న మగధీర సినిమా…రెండో సినిమాకే ఒక యంగ్ హీరో ఇండస్ట్రీ రికార్డులతో విరుచుకు పడటం చూసి టాలీవుడ్ మాత్రమే కాదు టోటల్ సౌత్ అండ్ నార్త్ ఇండియా మొత్తం ఆశ్యర్యపోయారు…
ఆ రేంజ్ లో హవాను సృష్టించిన మగధీర మూవీ ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది…42 కోట్ల రేంజ్ బడ్జెట్ తో 45 కోట్ల రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ ని సాధించి…బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే 5.95 కోట్లు, మొదటి వీకెండ్ 14 కోట్లు, మొదటి వారం 20.5 కోట్ల షేర్ ని….
రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకున్న ఈ సినిమా మొదటి వారం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో 41 కోట్లు అధికంగా వసూల్ చేసి చరిత్ర సృష్టించింది. 50 రోజుల వేడుకను 286 సెంటర్స్ లో అలాగే 100 రోజుల వేడుకను 223 డైరెక్ట్ సెంటర్స్ లో జరుపుకుని రికార్డ్ సృష్టించిన..
ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ 2009 టైం లో ఇండియా లో బిగ్గెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమాగా నిలిచి పాత రికార్డ్ హోల్డర్ అమీర్ ఖాన్ గజినీ 68 కోట్లు, శివాజీ 67 కోట్ల రికార్డ్ బ్రేక్ చేసి 73 కోట్ల కి పైగా షేర్ తో రికార్డులకెక్కింది. తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా…
అప్పట్లోనే 45 కోట్ల బిజినెస్ మీద ఆల్ మోస్ట్ 74 కోట్ల లోపు షేర్ ని అందుకుని బిజినెస్ మీద ఆల్ మోస్ట్ 29 కోట్ల లోపు లాభాన్ని సొంతం చేసుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది…ఇలాంటి ఆల్ టైం ఎపిక్ ఇండస్ట్రీ రికార్డులను సృష్టించిన మగధీర వచ్చి అప్పుడే 15 ఏళ్ళు అవ్వడం విశేషం….